Home రాజకీయాలు ఎన్నికల్లో ఎక్కడ్నించీ పోటీ పై త్వరలో చెప్తాను: పవన్

ఎన్నికల్లో ఎక్కడ్నించీ పోటీ పై త్వరలో చెప్తాను: పవన్

SHARE

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీచేసేది ఇంకా నిర్ణయించుకోలేదు. అనంతపురంలో మీడియా తో మాట్లాడిన పవన్ తాను ఎక్కడ నుంచి పోటీచేసేది జనవరి లేదా ఫిబ్రవరి లో ని్ర్ణయించుకుంటానని తెలియచేసారు.

వైఎస్ ఆర్ కాంగ్రస్ పార్టీ అదినేత జగన్ మోహన్ రెడ్డి గుర్తించనంతమాత్రాన, జనసేకు ఉనికి లేనట్లు కాదని పవన్ అన్నారు (మరి జగన్ ఏ రెడ్డి అని ఎందుకన్నట్టో?). తన ఒక్క పిలుపుతో లక్షల మంది కవాతుకు వచ్చారని పవన్ గుర్తుచేశారు.

ఇప్పటిదాకా పవన్ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీచేస్తారేమోనని రుమర్లు వున్నాయి ఎందుకంటే అక్కడ జరిగిన సభలో అలాంటి ఓ ప్రకటన కూడా పవన్ చేశారు. అయితే ఇప్పుడు మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు.