Home రాజకీయాలు కాంగ్రెస్ లో అప్పుడే సీఎం సీటుపై మొదలైన లొల్లి!

కాంగ్రెస్ లో అప్పుడే సీఎం సీటుపై మొదలైన లొల్లి!

SHARE

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిత్వం గురించి ఉన్న సెటైర్లు వేరే చెప్పనక్కర్లేదు. పార్టీలో రెండు డజన్ల మందికి పైనే ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారనే మాట మొదటి నుంచి వినిపిస్తోంది. ఎవరికి వారు తామే సీఎం అభ్యర్థులమన్నట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ లొల్లి ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి ఉన్నదే. అయితే ఇప్పుడు అది రోడ్డు మీదకు వచ్చేలా ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు రచ్చకు ఎక్కేలా ఉన్నారు.

ముందుగా మొదలుపెట్టాడు వీ హనుమంతరావు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం సీటును బీసీ వర్గాలకు ఇవ్వాలని వీహెచ్ అంటున్నాడు. ఈయనకూడా బీసీనే. ఇలా పరోక్షంగా తను ముఖ్యమంత్రి కావాలనే కోరికను వ్యక్తం చేశాడీయన. అసలుకు ఈఎన్నికల్లో హనుమంతరావు పోటీ చేయలేదు. గతంలో సోనియాగాంధీ ఈయనకు రాజ్యసభ సీటు ఇవ్వడంతో అలా కొన్నేళ్లు లీడర్ గాచలామణి అయ్యాడు. ఇప్పుడు సీఎం అయిపోతానని అంటున్నాడు.

అలాగే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి అవుతాడనే ఊహాగానం పట్ల వీహెచ్ మండిపడ్డాడు. రేవంత్ కు అలాంటి ఛాన్స్ ఇవ్వడానికి వీల్లేదని, అలా అనడానికి ఆజాద్ ఎవరు అని కూడా ఈయన ప్రశ్నించేశాడు.

ఇదీ కథ. ఇంకా తెలంగాణ ప్రజలు ఓటు వేయనే లేదు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం అప్పుడే మొదలుపెట్టేశారు. సీఎం సీటు విషయంలో వీది పోరాటం మొదలైనట్టే. ఈ పోరాటం ఉంటుందని అవగాహన ఉన్న తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ కు ఓటేస్తారా?