Home రాజకీయాలు తెలంగాణలో ఓడితే.. టీడీపీకి ఏపీలో చుక్కలేనా!

తెలంగాణలో ఓడితే.. టీడీపీకి ఏపీలో చుక్కలేనా!

SHARE

అనవసరంగా తెలంగాణ రాజకీయంలోకి దిగినట్టుగాక నిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంతా తన చుట్టూరానే తిరుగుతోంది. అంతటా తనే చక్రం తిప్పుతున్నాను అని చెప్పుకోవడం బాబుకు ఇష్టం. అందుకే తెలంగాణ రాజకీయంలోకి దిగాడు. అలాగని అన్ని చోట్లా పోటీ చేశాడా అంటే అదీ లేదు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే తక్కువ సీట్లకు పోటీ చేసింది టీడీపీ. అయితే కాంగ్రెస్ ను ముందు పెట్టి అంతా తనే నడిపిస్తున్నాని చంద్రబాబు నాయుడు భ్రమను కలిగించే యత్నం చేస్తున్నాడు.

ఒకవేళ తెలంగాణలో కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడుకు ఓకే. అయితే కూటమికి అంతగా అవకాశాలు కనిపించడం లేదు. మళ్లీ తెరాసనే వస్తుందనే మాట వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో గనుక కూటమి ఓడితే ఏపీలో టీడీపీకి చుక్కలు కనిపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

చంద్రబాబు నాయుడు తెలంగాణలో అంతా తానే అనే భ్రమను కలిగించాడు. ఫలితంగా ఓడిపోతే చంద్రబాబును ప్రజలు తిరస్కరించారనే అభిప్రాయం కలుగుతుంది. హైదరాబాద్ ను తనే ప్రపంచపటంలో పెట్టాను అని, సైబరాబాద్ ను తనే నిర్మించానని.. తెలంగాణను అంతా తనే అభివృద్ధి చేశానని చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడు.

ఈ మాటలన్నీ విన్న ప్రజలు కూటమిని అధికారంలోకి తీసుకురాకపోతే బాబువి అన్నీ ఉత్తుత్తి ప్రగల్బాలే అని ప్రజలు తేల్చేసినట్టుగా అవుతుంది. చంద్రబాబు నాయుడు సొంత డబ్బాను జనాలు పట్టించుకోలేదని స్పష్టం అవుతుంది. తెలంగాణ ఎన్నికల ప్రభావం త్వరలో జరిగే ఏపీ ఎన్నికల మీద కూడా ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే టీడీపీకి వీడటానికి రెడీ అయిన నేతలు తెలంగాణ ఎన్నికల ఫలితాలను గమనించి బయటకు వెళ్దామని అనుకుంటున్నారని సమాచారం.