Home రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు.. ఓటు రేటును పెంచేసిన పార్టీలు!

తెలంగాణ ఎన్నికలు.. ఓటు రేటును పెంచేసిన పార్టీలు!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు రేటును గణనీయంగా పెంచేశాయి పార్టీలు. తెలంగాణ లో ఎన్నడూ లేనంత స్థాయికి చేరిందట ఓటు రేటు. ఒక్కో చోట ఓటుకు ఐదు వేల రూపాయలు కూడా ఇస్తున్నారని తెలుస్తోంది. ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటే.. అన్ని ఐదు వేల రూపాయళ్లు ఇస్తున్నారని సమాచారం. ప్రధానంగా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్లలో ఓటు రేటు ఐదు వేల రూపాయలకు చేరిందని, ఇలాంటి చోట్ల ఇంతకు మించి కూడా ఇస్తున్నారని తెలుస్తోంది.

పట్టుబడుతున్న డబ్బే భారీ స్థాయిల్లో ఉంటోంది. ఒక్కో చోట కోట్ల రూపాయల డబ్బు దొరుకుతోంది. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఆర్థిక బలం బాగా కలిసి వచ్చిందని సమాచారం. భారీగా డబ్బులు ఇస్తాననే ఒప్పందంతోనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడట చంద్రబాబు నాయుడు. బాబు దగ్గర ఉన్న ఆర్థిక బలాన్ని చూసే తెలంగాణ కాంగ్రెస్ పొత్తుకురెడీ అయ్యిందని అంటున్నారు.

ఇక తెలుగుదేశం అభ్యర్థులు కూడా భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రత్యేకించి కూకట్ పల్లి నియోజకవర్గంలో భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని.. ఇక్కడ ఓటుకు ఐదారు వేల రూపాయల పంపకం జరుగుతోందని, తెలుగుదేశం ఈ మేరకు ఇస్తోందని తెలుస్తోంది. డబ్బు తీసుకున్న వాళ్లే ఈ విషయాన్నిచెబుతున్నారు.

ఇక్కడ నందమూరి సుహాసిని విజయం టీడీపీకి ప్రతిష్టగా మారింది. దీని కోసం కూకట్ పల్లి ఏరియాలోకి ఏపీ టీడీపీ నేతలు కూడా భారీగా దిగారు. కమ్మ నేతలే రంగంలోకి దిగారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి వీళ్లు భారీ మొత్తాలను పంచుతున్నారని సమాచారం అందుతోంది. ఓవరాల్ గా గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తెలంగాణలో ఓటు రేటు భారీగా పెరిగిందనేది మాత్రం స్పష్టం అవుతోంది.