Home రాజకీయాలు టీడీపీకి ఏపీలో మరో రాజీనామా.. బాబు సొంత జిల్లాలో!

టీడీపీకి ఏపీలో మరో రాజీనామా.. బాబు సొంత జిల్లాలో!

SHARE

ఏపీలో తెలుగుదేశం పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉన్నట్టుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలామంది రాజీనామాలు చేస్తూ ఉన్నారు. తాజాగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే రాజీనామా నమోదు అయ్యింది. పీలేరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఇక్బాల్ అహ్మద్ రాజీనామా చేశాడు. ఈయన ఏ పార్టీలోకి చేరతాడో ఇంకా స్పష్టత లేదు కానీ.. తెలుగుదేశంపార్టీకి అయితే రాజీనామా చేశాడు.

తను పాతికేళ్లుగా టీడీపీ కోసం పని చేస్తున్నానని ఇక్బాల్ చెప్పాడు. కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ తరఫున పని చేశాను అని.. అయితే కిరణ్ తమ్ముడిని టీడీపీలోకి చేర్చుకుని చంద్రబాబు నాయుడు తనను పట్టించుకోలేదని వాపోయాడు.

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి చేర్చుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు తనకు గట్టి హామీలు ఇచ్చాడని, నామినేటెడ్ ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని కూడా ఇస్తానని హామీ ఇచ్చాడని.. అయితే బాబు ఆ మాటను నిలబెట్టుకోలేదని చెప్పాడు.

తనకు హామీ ఇచ్చి కిషోర్ ను టీడీపీలోకి చేర్చుకున్న చంద్రబాబు నాయుడు.. మళ్లీ ఆయనకే నామినేటెడ్ పదవిని ఇచ్చాడని.. తను మాత్రం పట్టించుకోలేదని అన్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడు నమ్మి ఇక మోసపోదలుచుకులేదని అందుకే రాజీనామా చేస్తున్నట్టుగా ఈయన ప్రకటించాడు. అయితే ఈయన తదుపరి ఏ పార్టీలోకి చేరతాడో ప్రకటించలేదు.

ఈయన వైసీపీలోకి చేరవచ్చే అనే ప్రచారమూ సాగుతోంది. అలాగే జనసేన వైపూ చూస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.