Home రాజకీయాలు తెలంగాణలో మద్దతుపై పవన్.. వాళ్లకే ఓటేయాలట!

తెలంగాణలో మద్దతుపై పవన్.. వాళ్లకే ఓటేయాలట!

SHARE

తెలంగాణలో తన సపోర్టర్లుఎవరికి మద్దతు ఇవ్వాలో ప్రకటించాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ఈ విషయం మీద ఐదో తేదీన ప్రకటన చేస్తానని ఇది వరకూ పవన్ ప్రకటించాడు. మరి అలా ముహూర్తాన్ని ప్రకటించేసరికి పవన్ ఏప్రకటన చేస్తాడో అనేది అందరిలోనూ ఆసక్తిని రేపింది. అయితే పవన్ ప్రకటన మాత్రం అస్పష్టంగానే ఉంది.

ఏదో ఒక పార్టీకి మద్దతు అని పవన్ ప్రకటించలేదు. తన సపోర్టర్లు ఎవరికి ఓటేయాలో పవన్ చెప్పలేదు. మీ ఇష్టం అన్నట్టుగా ప్రకటన చేశాడు.

ప్రస్తుతం తెలంగాణ ప్రజల ముందు ముగ్గురున్నారని..తెలంగాణను ఇచ్చామనే వాళ్లు, తెలంగాణను తెచ్చామనేవాళ్లు, తెలంగాణను పెంచామనే వాళ్లు ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్నారని..వారిలో ఎవరైతే పారదర్శకమైన పాలనను అందిస్తారో, వారిలో ఎవరైతే నీతిమంతమైన పాలనను అందిస్తామని ప్రజలు భావిస్తారో.. వారికే ఓటేయాలని పవన్ పిలుపునిచ్చాడు.

మరి ఈ మాత్రం ప్రకటన చేయడానికి పవన్ ముహూర్తాన్ని సైతం పెట్టుకున్నాడు. సమయాభావం వల్ల మాత్రమే తెలంగాణలో తన పార్టీ పోటీ చేయలేదని పవన్ చెప్పుకొచ్చాడు. ఈ కామెడీలే పవన్ తగ్గించుకుంటే బావుంటుంది. అన్ని పార్టీలకూ ఉన్న సమయం, ఇటీవలే మొదలైన తెలంగాణ జనసమితికి ఉన్న సమయం పవన్ కల్యాణ్ కే ఎందుకు లేకుండా పోయిందో!