Home రాజకీయాలు జగన్ పై హత్యాయత్నం.. ఏపీ గవర్నమెంట్ కు ఇంకో ఎదురుదెబ్బ!

జగన్ పై హత్యాయత్నం.. ఏపీ గవర్నమెంట్ కు ఇంకో ఎదురుదెబ్బ!

SHARE

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విషయంలో ఏపీ ప్రభుత్వానికి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి. జగన్ పై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర ధర్యాప్తుసంస్థా లేదా ఏదైనా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న హై కోర్టు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కోరిన సమయంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంది.

ఇక తాజాగా జగన్ పై హత్యాయత్నం విషయంలో ఏపీ ప్రభుత్వం సొంతంగా ధర్యాప్తు చేపట్టడాన్ని కోర్టు తప్పు పట్టింది. జరిగిన ఘటన ఎయిర్ పోర్టులో. ఇలాంటి నేపథ్యంలో ఆ ఘటనపై విచారణ జరపాల్సింది జాతీయ ధర్యాప్తు సంస్థ. మరి కేసును ఎన్ఐఏకు అప్పగించకుండా ఏపీ ప్రభుత్వం ఎలా విచారణ చేపట్టింది అని హై కోర్టు ప్రశ్నించింది.

జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వ పెద్దలు ఈ వ్యవహారంలో జోక్యం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అసలు విచారణ అంటూ ఏమీ జరగకుండానే ఏపీ డీజీపీ ఈ ఘటనపై ప్రకటన చేశాడు. జగన్ అభిమాని ఆ పని చేశాడంటూ డీజీపీ వ్యాఖ్యానించాడు. ఆ తీరు విమర్శల పాలైంది.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ఏపీ ప్రభుత్వ ముఖ్యులు కూడా జగన్ పై హత్యాయత్నం విషయంలో బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారు. ఇప్పుడు కోర్టులో ఆ తీరుపై కూడా చర్చ జరగాల్సి ఉంది.

జగన్ పై హత్యాయత్నం విచారణను ఎన్ఐఏకు అప్పగించే ఆలోచన చేస్తోంది న్యాయస్థానం. అయితే ఏపీ ప్రభుత్వం దీనికి నిరాకరించింది. అయితే ఆ వాదనతో కోర్టు ఏకీభవిచంలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించమని న్యాయస్థానం కోరింది.