Home రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు.. ఈ రేంజ్ లో ధన ప్రవాహమా!

తెలంగాణ ఎన్నికలు.. ఈ రేంజ్ లో ధన ప్రవాహమా!

SHARE

పట్టుబడుతున్న డబ్బే ఇంత అయితే.. పంపకాల్లో వెళ్లిపోయిన డబ్బు ఏ స్థాయిలో ఉండి ఉండాలి! ఒక్కో నియోజకవర్గం అభ్యర్థి దగ్గర పట్టుబడుతున్న మొత్తాలు కోట్ల రూపాయల్లో.. ఉంటున్నాయి. అరకోటి మొత్తాలుకూడా దొరుకుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రచార పర్వం దాదాపు పూర్తి అవుతోంది. మరో రోజు ప్రచారం మాత్రమే మిగిలి ఉంది. ఇక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో ఓట్లకు ఇవ్వాల్సిన నోట్లే మిగిలి ఉన్నట్టు.

ఇలాంటి నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించిన డబ్బు భారీ మొత్తంలో పట్టుబడుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. అటు మహాకూటమి అభ్యర్థులు, ఇటు టీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించి కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి.

ముందుగా తెరాస నేత, కొండగల్ అభ్యర్థి ఇంటి వద్ద అరకోటి మొత్తం లభించింది. అది ఎన్నికల్లో పంచేందుకు దొరికిందే అని వార్తలు వస్తున్నారు. ఇక తాజాగా బెల్లంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి తరలుతున్న యాభై లక్షల రూపాయల మొత్తం దొరికింది.

ఇక మహాకూటమి అభ్యర్థుల సొమ్ములూ బాగానే దొరుకుతున్నాయి. కూటమి అభ్యర్థి, శేరిలింగంపల్లి టీడీపీ నేత భవ్యా ఆనందప్రసాద్ తనయుడి వద్ద డెబ్బై లక్షల రూపాయల మొత్తం దొరికింది. ఇక మహాకూటమి అభ్యర్థులకు సంబంధించిన భారీ డబ్బుల డంప్ ను పోలీసులు కనుగొన్నారు.

తనిఖీల్లో ఏకంగా ఐదు కోట్ల రూపాయలా ఎనభై లక్షలు దొరికింది. ఇందులో పలువురు నేతల వాటాలున్నాయి. కొండామురళిది రెండు కోట్ల రూపాయల ముప్పై లక్షలు అని, నామా నాగేశ్వరరావుది కోటిన్నర అని, వరంగల్ కాంగ్రెస్ నేత రవిచంద్రది రెండు కోట్ల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి. హవాలా సొమ్ము ఇది అని, పంపకాలకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని సమాచారం.