Home రాజకీయాలు సుజనా అరెస్టు? గాలికి వదిలేసిన టీడీపీ!

సుజనా అరెస్టు? గాలికి వదిలేసిన టీడీపీ!

SHARE

తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి వరసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యాడు. దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని సుజనాకు చెందిన కంపెనీలు అప్పుగా తీసుకున్నాయి. వ్యాపారంలో నష్టాలని ఆ సొమ్ములను ఎగవేశారు. ఆ కంపెనీలే డొల్ల కంపెనీలు అని లోన్ల కోసమే వాటిని పుట్టించినట్టుగా ఈడీ నిర్ధారించింది. ఈ స్కామ్ తో సంబంధం ఉందని చౌదరికి నోటీసులు జారీ చేసింది.

అయితే దానితో తనకు సంబంధం లేదని చౌదరి చెప్పుకొచ్చాడు. కానీ… ఈడీ అంతటితో వదలడం లేదు. తను విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ కోర్టుకు వెళ్లినా చౌదరికి ఊరట దక్కలేదు. ఆయన విచారణకు హాజరు కావాల్సిందే అంటూ కోర్టు స్పష్టం చేసింది.

ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ చౌదరి గురించి స్పందించడం ఆపేసింది. చౌదరి గురించి చంద్రబాబు నాయుడు అస్సలు మాట్లాడటం లేదు. తన పార్టీ ఎంపీ, తను కేంద్రమంత్రిగా చేసిన వ్యక్తి, తనకు అత్యంత సన్నిహితుడు అయిన వ్యక్తి ఈడీ విచారణకు హాజరవుతుంటే చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు.

చౌదరిని ఈడీ అరెస్టు చేయవచ్చని చంద్రబాబు కు కూడా తెలిసిందని.. అందుకే బాబు ఇప్పుడు కామ్ గా ఉన్నాడని, చౌదరి గురించి మాట్లాడితే ఆ వ్యవహారం తమకు చుట్టుకుంటుందని తెలుగుదేశం నేతలు కూడా మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. వేరే పార్టీ నేతలు ఎవరైనా ఇలా ఈడీ విచారణకు హాజరవుతుంటే చంద్రబాబు నాయుడు , తెలుగుదేశం నేతలు ఎంతగా రెచ్చిపోయే వాళ్లో తెలిసిన సంగతే!