Home ప్రత్యేకం పవన్ కు అంత సీన్ లేదని జగన్ కు అర్థమైనట్టే!

పవన్ కు అంత సీన్ లేదని జగన్ కు అర్థమైనట్టే!

SHARE

పవన్ కల్యాణ్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చాలా సహనమే వహించాడు. జగన్ టార్గెట్లో ఏ రోజూ పవన్ కల్యాణ్ లేడు. గత ఎన్నికల ముందు తన గురించి అవాకులు చవాకులు పేలుతూ పవన్ కల్యాణ్ రెచ్చిపోతున్నా జగన్ పట్టించుకోలేదు. ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ ను జగన్ ఇక అసలుకే పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడును గెలిపించాలని, అతడి హామీలకు తను పూచీ అని పవన్ చెప్పుకొచ్చినా చాన్నాళ్లు వైసీపీ పవన్ గురించి అస్సలు పట్టించుకోలేదు.

ఇక పవన్ కల్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబును రక్షించడానికి అన్నట్టుగా మీడియా ముందుకు వచ్చాడో అప్పుడు వైసీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు స్పందించారు. చంద్రబాబుకు పార్ట్ నర్ గా పవన్ పని చేస్తున్నడంటూ వారు విమర్శించే వాళ్లు.

అయితే పవన్ మాత్రం తన స్థాయికి మించి తరచూ జగన్ గురించి ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తూ వచ్చాడు. అయినా జగన్ పట్టించుకోలేదు. జగన్ పోరాటాలను జగన్ రాజకీయాన్ని కించపరిచే విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వచ్చాడు. అయినా జగన్ ఓపికగానే ఉన్నాడు. ఆఖరికి కొన్నాళ్ల కిందట మీడియా అడిగితే జగన్ స్పందించాడు. అప్పట్లో వపన్ తెగ అక్కసు వెల్లగక్కాడు.

తన గురించి జగన్ మాట్లాడితే.. తన ఇంట్లో ఆడవాళ్ల గురించి జగన్ మాట్లాడినట్టుగా పవన్ ఏడ్చాడు. ఇక మళ్లీ ఈ మధ్య జగన్ ను అతిగా టార్గెట్ చేస్తూ వచ్చాడు పీకే. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ అధినేత ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇది మంచిదే అని చెప్పాలి.

పవన్ మాట్లాడుతున్నా జగన్ కామ్ గా ఉంటే.. పవన్ కూతలే నిజం అవుతాయి. అందుకు భిన్నంగా పవన్ కు కూడా జగన్ గట్టి గా రిప్లై ఇచ్చాడు. జగన్ వ్యాఖ్యలపై పవన్ ఇంకా స్పందించలేదు. తనను ఎవరూ ఏమీ అనకూడదు, తను మాత్రం ఎవరినైనా ఏమైనా అనొచ్చన్నట్టుగా బిహేవ్ చేసే పవన్ కల్యాణ్ ఈ సారి ఏం నీతులు చెబుతాడో!