Home రాజకీయాలు చంద్రబాబు తనను తాను విమర్శించుకున్నట్టుంది!

చంద్రబాబు తనను తాను విమర్శించుకున్నట్టుంది!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రసంగాలు ఎలా ఉన్నాయి అంటే… ఆయను ఆయన విమర్శించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా చంద్రబాబు నాయుడు తనను తాను పొగుడుకోవడమే తప్ప ఆత్మ పరిశీలన చేసుకున్నట్టుగా ఎక్కడా కనిపించడు. తన గొప్పలను తను చెప్పుకోవడమే తప్ప.. చంద్రబాబు నాయుడు ఆత్మ విమర్శ చేసుకునే టైపు కాదు. తన డబ్బా తను కొట్టుకుంటూ నవ్వుల పాలవుతూ ఉంటాడీయన.

అయితే తెలంగాణకు వచ్చి మాత్రం ఇక్కడి పాలనను తెగ విమర్శిస్తున్నాడు బాబు. ఈ విమర్శలు మాత్రం అన్నీ చంద్రబాబుకు తగిలే విధంగానే ఉన్నాయి. ముందుగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బాబు రెచ్చిపోయాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను తీవ్రంగా విమర్శించాడు. వారు ద్రోహులు అంటూ విరుచుకుపడ్డాడు.

ఏపీలో చంద్రబాబు నాయుడు ఫిరాయింపులను ఒక రేంజ్లో ప్రోత్సహించాడు. అలాంటి బాబు తెలంగాణలో ఫిరాయింపులను తప్పు పట్టాడు. అదే అనుకుంటే.. కేసీఆర్ పాలనలో దుబారా ఎక్కువైందని బాబు విరుచుకుపడటం మరో ఎత్తు. దుబారా ఖర్చుల విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే తీవ్రంగా విమర్శల పాలయ్యాడు. బాబు ఖర్చులకు ఏపీ బడ్జెట్ చాలడం లేదనే మాట వినిపిస్తూ ఉంది. అందుకే లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేస్తున్నారనే విమర్శను ఎదుర్కొంటున్నారు. బాబు మాత్రమే గాక.. ఆయన కేబినెట్లోని మంత్రులుకూడా పంటి నొప్పికి విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని విమర్శల పాలయ్యారు.

అలాంటి చంద్రబాబు నాయుడు తెలంగాణలో దుబారా అయిపోతోందని అంటూ విమర్శించడం అల్టిమేట్ కామెడీ. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాబు మాట్లాడుతున్న మాటలు.. ఆయనకే బాగా తగులుతున్నట్టుగా ఉన్నాయి.