Home ప్రత్యేకం మహాకూటమికి ఆయనే పెద్ద మైనస్ పాయింట్!

మహాకూటమికి ఆయనే పెద్ద మైనస్ పాయింట్!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరి కొన్ని గంటల గడువు మాత్రమే ఉంది. మరో నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక రోజు విరామం. ఆ తర్వాతి రోజు పోలింగ్. ఇలాంటి నేపథ్యంలో విజయావకాశాల గురించి గట్టి చర్చ జరుగుతూ ఉంది. మరి అసలు కథ ఎలా ఉంది అనే అంశం గురించి వాకబు చేస్తే ఆసక్తిదాయకమైన విషయాలు తెలుస్తున్నాయి.

తెలంగాణలో వాస్తవంగా అయితే పరిస్థితి పోటాపోటీగా ఉందని, ఇక్కడ తెరాస కాంగ్రెస్ లు రెండూ బలంగానే ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనాలు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు తెరాసకు అవకాశం ఇచ్చారు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది కాబట్టి.. ఆ పార్టీ పట్ల కూడా ఈ సారి ఓటర్లు కొంత దయ చూపే అవకాశాలు ఉండేవనే అంటున్నారు.

అయితే కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం చేసిందని.. చంద్రబాబుతో చేతులు కలపడమే ఆ తప్పిదం అని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ చంద్రబాబుతో గనుక ఈ సారి కాంగ్రెస్ చేతులు కలపకపోయుంటే అసలు కథ వేరేగా ఉండేదని అంటున్నారు.

మహాకూటమి అంటూ కాంగ్రెస్ ఏవో పిచ్చి లెక్కలు వేసుకుందని.. టీడీపీతో దోస్తీతో కాంగ్రెస్ కు వచ్చిన లాభం కంటే చంద్రబాబు వల్ల కలుగుతున్న నష్టమే ఎక్కువని..బాబు దెబ్బకు కాంగ్రెస్అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయని.. ఎన్నికల్లో మహాకూటమికి బాబు వల్ల కాంగ్రెస్ కు తిరస్కృతి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.