Home రాజకీయాలు బాబుకు, బాలయ్యకు రోజా సూపర్ కౌంటర్లు!

బాబుకు, బాలయ్యకు రోజా సూపర్ కౌంటర్లు!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నీతులు చెబుతూ తిరుగుతున్న చంద్రబాబుకు, ఆయన బామ్మర్ది బాలయ్యకు సూపర్ కౌంటర్లు ఇచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. తెలంగాణ ఎన్నికల్లో ఫిరాయింపుల గురించి చంద్రబాబు నాయుడు, బాలయ్యలు మాట్లాడిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గి పలువురు ఎమ్మెల్యేలు తెరాసతో కూడారు. వారిని ద్రోహులుగా అభివర్ణిస్తున్నారు. వారు సంతలో పశువులు అని చంద్రబాబు నాయుడు అన్నాడు. వారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది వెళ్లిన వాళ్లని బాలయ్య చెప్పుకొచ్చాడు. ఇదీ కథ.

ఒకవైపు ఏపీలో ఫిరాయింపులకు పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు. ఇరవై మందికి పై గా ఎమ్మెల్యేలను చేర్చుకుంది చంద్రబాబు నాయుడు. వారిలో నలుగురికి మంత్రి పదవులను కూడా ఇచ్చాడాయన. తెలంగాణకు వెళ్లి మాత్రం వీరే నీతులు చెబుతున్నారు.

ఈ అంశాన్నే రోజా ప్రస్తావించింది. చంద్రబాబుకు సిగ్గూశరంఉందా అని ప్రశ్నించింది. అంతగా ఫిరాయింపుల విషయంలో నిలదీయాలని అనిపిస్తే బాలయ్య తన బావ చంద్రబాబును నిలదీసుకోవాలని కూడా రోజా వ్యాఖ్యానించింది. ఈ విధంగా తెలుగుదేశం నేతలు చెబుతున్న నీతిమాలిన నీతులకు వైసీపీ తరఫున కౌంటర్లు ఇచ్చింది రోజా.

ఇక పవన్ కల్యాణ్ విషయంలోనూ రోజా గట్టిగా మాట్లాడింది. పవన్ కు దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించాలని, ఫిరాయింపుదార్ల మీద వేటు వేయని కోడెలను ప్రశ్నించాలని.. కోడెల వియ్యంకుడి ఇంట్లో జనసేన ఆఫీసును నడుపుతూ.. పవన్ వారిని ఎలాప్రశ్నించగలడు అని రోజా ఎద్దేవా చేసింది.