Home రాజకీయాలు పవన్ కల్యాణ్… ఇలాగే వెళ్లు.. ప్రత్యర్థుల కోరిక అదే!

పవన్ కల్యాణ్… ఇలాగే వెళ్లు.. ప్రత్యర్థుల కోరిక అదే!

SHARE

ప్రసంగాల్లో అర్థం లేని తనమే ఎక్కువగా ఉంటుంది. తను ఎవరినైనా ఏమైనా అనొచ్చు. తనను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు. అలా ఏమైనా అంటే వాళ్ల మీద పడి రక్కేసినంత పని చేస్తాడు. ఇక తాడూ బొంగంరం లేని పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని కూడా చెబుతాడు. ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇప్పటి వరకూ జనసేనకు ఒక రూపం లేదు. ఈ మాత్రానికే అధికారంలోకి వచ్చేస్తానని కూడా పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్నాడు. ఇదీ కథ.

పవర్ ప్రసంగాల్లో ఏ మాత్రం సంబద్ధత కూడా ఉండదు. ఉదాహరణకు జేసీ దివాకర్ రెడ్డి మంచోడు.. ఆయన తమ్ముడో జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం చెడ్డోడు అని పవన్ అంటాడు. జేసీ అన్నదమ్ముల్లో ఏం తేడాలు లేవు. వాళ్లిద్దరూ కలిసి కట్టుగా సాగుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభాకర్ రెడ్డి చెడ్డోడు.. దివాకర్ రెడ్డి మంచోడు అని పవన్ అనడం.. ఆయన చేతగాని తనాన్ని చాటుతోంది.

ఇక కరువుపై అధ్యయనం అని అన్నాడు. అప్పుడే ఆరు నెలల కిందట కూడా పవన్ అనంతపురంలో ఇలాగే పర్యటించాడు. అప్పట్లోనూ కరువుపై అధ్యయనం అనే అన్నాడు. ఇప్పుడూ అదే చెబుతున్నాడు. అప్పుడు చేసింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?

ఇక వైసీపీ నేత బొత్స నోరు హద్దులో పెట్టుకోవాలని కూడా పవన్ హెచ్చరించాడు. ఈ మధ్య పవన్ కల్యాణ్ కు సమాధానం ఇచ్చాడు బొత్స. దీంతో పవన్ కు ఆగ్రహం వచ్చింది. అంటే పవన్ మాత్రమే మాట్లాడాలి, పవన్ మాత్రమే నోటికి వచ్చినట్టుగా మాట్లాడాలి. ఇంకెవరూ ఏమీ అనకూడదు. ఇదీ ఈయన తీరు.

పవన్ ప్రత్యర్థులుకూడా ఇదే కోరుకుంటున్నారు. ఈయన ఇలాంటి తీరుతోనే కొనసాగాలని.. అప్పుడు జనాలు కూడా పవన్ ను ఈజీగా తిరస్కరించేస్తారని వారు అంచనా వేస్తున్నారు.