Home రాజకీయాలు నీతులు చెప్పే పవన్… ఇలాంటి వారిని చేర్చుకుంటున్నాడా!

నీతులు చెప్పే పవన్… ఇలాంటి వారిని చేర్చుకుంటున్నాడా!

SHARE

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ నోరు తెరిస్తే చెప్పేవి నీతులే అని వేరే చెప్పనక్కర్లేదు. తన ను ఎవ్వరూ ఏమీ అనకూడదు అని..తను నిప్పుని అన్నట్టుగా పవన్ కల్యాణ్ అందరి మీదా ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. అందరినీ అన్ని విషయాల్లోనూ పవన్ ప్రశ్నించేస్తూ ఉంటాడు. ఇక పవన్ తీరేమిటి అనేది అందరికీ తెలిసిందే.

తన అన్నను ఎవరూ ఏమీ అనకూడదు. తను కూడా ఏమీ అనడు. కానీ.. ఊర్లో వాళ్లందరికీ తను నీతులు చెబుతాడు. తన నాలుగు పెళ్లిళ్ల వ్యవహారం గురించి ఎవ్వరూ ఏమీ అనకూడదు. కానీ తను మాత్రం రాహుల్ గాంధీ బ్రహ్మచర్యం గురించి మాట్లాడతాడు. ఇదీ పవన్ తీరు.

ఇక తన పార్టీలోకి నేతలను చేర్చుకోవడంలో కూడా పవన్ కల్యాణ్ ద్వంద్వనీతిని ఫాలో అవుతూ ఉన్నాడు. మొదట్లోనేమో తన పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోను అని పవన్ ప్రకటించాడు. జంపర్స్ కు తన పార్టీలో చోటు లేదని పవన్ అప్పట్లో ప్రకటించాడు. ఇప్పుడేమో జనసేన వలస పక్షులతో నిండిపోతోంది.

అటు తెలుగుదేశంలో నో.. ఇటు వైకాపాలోనో తమకు టికెట్ దక్కదని అర్థం చేసుకున్న వాళ్లు పవన్ పార్టీలోకి వచ్చి చేరుతూ ఉన్నారు. అదలా ఉంటే.. ఇప్పుడు మాజీ మంత్రి, టీడీపీ నేత రావెల కిషోర్ బాబు జనసేనలోకి చేరుతున్నాడట.

రావెల తీరు వివాదాస్పదం. ఆ మధ్య రావెల తనయుడు హైదరాబాద్ లో ఒక మహిళను పట్టుకోబోయి వార్తల్లోకి వచ్చాడు. అప్పట్లో రావెల తన పరపతిని ఉపయోగించుకుని తనయుడిని కాపాడుకున్నాడని అంటారు. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు జనసేనలోకి చేర్చుకుంటున్నాడట పవన్ కల్యాణ్. మరి నీతులు చెప్పే పీకే మరి ఇలాంటి వారిని చేర్చుకోవడం ఏమిటో!