Home ప్రత్యేకం తన నిస్సిగ్గు తనాన్ని బాబు మరోసారి బయటపెట్టుకున్నాడా!

తన నిస్సిగ్గు తనాన్ని బాబు మరోసారి బయటపెట్టుకున్నాడా!

SHARE

తెలంగాణలో ఫిరాయింపుదారుల మీద ధ్వజమెత్తాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గి వేరే పార్టీలోకి చేరిన ఫిరాయింపుదారులను ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చాడు. మామూలుగా తన పార్టీ తరఫున చంద్రబాబు ప్రచారం చేసుకుని ఉంటే అది పెద్ద కథ కాదు. అయితే ఫిరాయింపుల అంశం మీద చంద్రబాబు నాయుడు స్పందించడమే అసలు కథ.

ఫిరాయింపుదారులను విమర్శిస్తూ చంద్రబాబు మాట్లాడటానికి మించిన ప్రహసనం ఉండదు. ఎందుకంటే.. ఏపీలో పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించాడు చంద్రబాబు నాయుడు. ఏకంగా ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్నాడు. నైతికతకు కట్టుబడి వారి చేత చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించలేదు. అలాగే.. చట్టానికి కట్టుబడి వాళ్ల మీద అనర్హత వేటు కూడా పడలేదు.

ఇదీ కథ. ఇక ఫిరాయింపుదార్లకు మంత్రి పదవవులను ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడిదే. ఇలాంటి నేపథ్యం కలిగిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో మాత్రం మళ్లీ ఫిరాయింపులను తప్పు పట్టాడు. ఫిరాయింపుదార్లు తనకు ద్రోహం చేసిన వాళ్లని.. వాళ్లను చిత్తుగా ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చాడు.

బాబు నిస్సిగ్గు పర్వంలో ఇది మరో చాప్టర్ అనుకోవచ్చు. అవకాశవాదంతో మాట్లాడటం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదు. ప్రతి విషయంలోనూ అదే తీరుతోనే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫిరాయింపుదార్ల వ్యవహారంలో కూడా బాబు అదే తీరునే వ్యవహరించాడని చెప్పాలి. అయినా తన నిస్సిగ్గు తనాన్ని చంద్రబాబు ఇంకా ఎన్నాళ్లు ఇలా బయట పెట్టుకుంటూ ఉంటాడో!