Home రాజకీయాలు జగన్ పై పవన్ అక్కసు.. సీఎం కానివ్వడట!

జగన్ పై పవన్ అక్కసు.. సీఎం కానివ్వడట!

SHARE

మరి తెలిసి మాట్లాడతాడో.. లేక తెలియక మాట్లాడతాడో కానీ… జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకించి జగన్ విషయంలో పవన్ కల్యాణ్ అక్కసు అంతా బయటపడుతూ ఉంది. ఇప్పటి వరకూ జగన్ పై పవన్ చాలా వ్యాఖ్యానమే చేశాడు. జగన్ మగతనం గురించి మాట్లాడాడు. జగన్ కు ధైర్యం లేదన్నాడు. జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని విరుచుకుపడ్డాడు. పవన్ ఇలా చేసే ప్రతి ఆరోపణా రివర్స్ లో ఆయనకే తగులుతూ ఉంది. తనేదో శుద్ధపూసను అయినట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడటంపై పంచ్ లు పడుతూనే ఉన్నాయి.

అయినా పవన్ తీరులో మార్పు రావడం లేదు. ఆ విషయం మరోసారి రుజువు అయ్యింది. ఈ సారి పవన్ మరో అడుగు ముందుకు వేశాడు. జగన్ ముఖ్యమంత్రి కాకుండా తను అడ్డు పడతా అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. మరి ఒకరు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడ్డేంత మగాడా పవన్ కల్యాణ్ అనే సందేహం రానే వస్తుంది.

ఎవరైనా ముఖ్యమంత్రి కావాలంటే పవన్ కల్యాణ్ పర్మిషన్ అవసరం లేదు. ప్రజలు ఓటేసి గెలిపిస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. లేకపోతే కాలేడు. ఈ విషయంలో పవన్ కు ఎలాంటి ప్రమేయం ఉండదు. అయినా పవన్ తనేదో సూపర్ పవర్ అయినట్టుగా జగన్ ను ముఖ్యమంత్రి కానివ్వను అని అంటూ మాట్లాడటం అతడి నైజాన్ని తెలియజేస్తోంది.

అతడితి అహంకారమో..అమాయకత్వమో అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి కావాలని వచ్చిన తన అన్న ఏమయ్యాడో పవన్ కు తెలియదా. ఎందుకో ఈ చెత్త మాటలు!