Home Uncategorized ‘2.0’ పై మహేష్‌ ప్రశంసలు

‘2.0’ పై మహేష్‌ ప్రశంసలు

SHARE

ప్రస్తుతం సౌత్, నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో 2.0 ఫీవర్‌ కనిపిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సినీ ప్రముఖులు ఈ విజువల్‌ వండర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తరణ్‌ ఆదర్శ్‌, రమేష్‌ బాలా, శ్రీధర్‌ పిల్లై లాంటి ఫిలిం క్రిటిక్స్‌ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు.

టాలీవుడ్ స్టార్స్‌ కూడా 2.0 సినిమాపై ట్వీట్ చేస్తూ మరింత హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే నాని, అల్లరి నరేష్ లాంటి స్టార్స్‌ ఆసక్తికర ట్వీట్స్‌తో ఆకట్టుకోగా తాజాగా మహేష్ బాబు 2.0 పై టీంను పొగడ్తలతో ముంచెత్తారు. ‘2.0 ఓ సినిమాటిక్‌ జెమ్‌. ఈ సినిమా మీకు గతంలో ఎప్పుడూ పరిచయం లేని ఓ గొప్ప అనుభూతి కలిగిస్తుంది. శంకర్‌ సార్‌ మీరు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. రజనీకాంత్ సర్‌, అక్షయ్‌ కుమార్‌, 2.0 టీం మొత్తానికి నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు మహేష్‌.