Home రాజకీయాలు తెలంగాణలో.. వాళ్ల హవా ఉంటుందన్న లగడపాటి!

తెలంగాణలో.. వాళ్ల హవా ఉంటుందన్న లగడపాటి!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఇంత వరకూ తనే సర్వే చేయించలేదని మొన్నటి వరకూ ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు కొత్త సర్వే అంటూ ముందుకు వచ్చాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారో చెప్పని లగడపాటి..ఆ విషయాన్ని డిసెంబర్ ఏడో తేదీన ప్రకటిస్తానని అన్నాడు. ఆ రోజున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగుతుంది.ఆ రోజు సాయంత్రం చాలా మంది తమ సర్వేలను ప్రకటిస్తారు. ఆ రోజు లగడపాటి కూడా సర్వేను ప్రకటిస్తాడట.

మరి ఆ రోజు కన్నా ముందు కొన్ని శాంపిల్స్ ను ఇచ్చాడు లగడపాటి. ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరో రోజుకు ఇద్దరు పేర్లను చెబుతానని ఈయన ప్రకటించాడు. అందులో భాగంగా తొలి రోజు రెండు పేర్లను ప్రకటించాడు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఇండిపెండెంట్ల హవా ఉంటుందని లగడపాటి అంటున్నాడు. మొత్తం పది మంది వరకూ ఇలాంటి వారు నెగ్గే అవకాశం ఉందని అన్నాడు.

అందులో భాగంగా నారాయణ్ పూర్ సీటు నుంచి శివకుమార్ రెడ్డి అనే ఇండిపెండెంట్ విజయం సాధిస్తాడని, బోధ్ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ జాదవ్ గెలుస్తాడని లగడపాటి ప్రకటించాడు. ప్రస్తుతానికి ఈ వివరాలు అని.. రానున్న నాలుగు రోజుల్లో మిగతా ఇండిపెండెంట్స్ పేర్లను ప్రకటిస్తానని లగడపాటి ప్రకటించాడు.

లగడపాటి వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ నేతలు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. లగడపాటి సర్వేను నమ్మ వద్దని ప్రకటించాడు. ఆలోచించుకుని ఓటు వేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చాడు. లగడపాటి సర్వేకు కూడా ఇది కొత్త పరీక్షే!