Home రాజకీయాలు ఇలాంటి అవార్డులతో లోకేష్ పరువు తీస్తున్నారా!

ఇలాంటి అవార్డులతో లోకేష్ పరువు తీస్తున్నారా!

SHARE

కేష్ గురించి అతడి ప్రతిభా పాటవాల గురించి అతడి సమర్థత గురించి ఎంత తక్కువగా మాట్లాడుంటే.. జనాలు ఈ టాపిక్ గురించి ఎంత తక్కువగా డిస్కస్ చేస్తే తెలుగుదేశం పార్టీకే అంత మంచిది. ఎందుకంటే.. లోకేష్ ప్రతిభా పాటవాలు ఏపాటివో ఇప్పటికే బయటపడిపోయాయి. ఈ విషయంలో లోకేష్ ఒక కామెడీ పీస్ అయిపోయాడు కూడా. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ ఈ విషయంలో లోకేష్ ను దెప్పి పొడచడానికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే రంగం సిద్ధం చేస్తోంది.

లోకేష్ ను ప్రపంచంలోనే అత్యంత ప్రభావ శీల యువనేతగా ప్రకటించిందట ఒక సంస్థ. తెలుగుదేశం అనుకూల మీడియా ఈ మేరకు ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రకటనలతో మళ్లీ లోకేష్ పై జనాలు సెటైర్లు వేసేలా చేస్తోంది టీడీపీ అనుకూల మీడియా.

లోకేష్ ఇప్పటికే తన మాట తీరుతో నవ్వుల పాలయ్యాడు. అలాగే లోకేష్ జనాల నుంచి గెలిచి వచ్చిన వ్యక్తి కాదు. కనీసం ఎమ్మెల్యేగా గెలిచే సత్తా లేక.. ఎమ్మెల్యేగా నెగ్గేంత వరకూ ఆగలేక లోకేష్ నామినేటెడ్ పదవితో మంత్రి అయ్యాడు. ఎమ్మెల్సీగా పదవిని తీసుకుని ప్రత్యర్థుల చేత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక లోకేష్ నోరు తెరిస్తే నెటిజన్లకు ఆ రోజు పండగే.

ఈయన ఏదో నోరు జారడం.. దాన్ని పట్టుకుని నెటిజన్లు ఆటాడేసుకోవడం జరుగుతూ ఉంటుంది. లోకేష్ కు తెలుగు మాట్లాడటం కూడా రాదని తేలిపోయిందిప్పటికే. వాస్తవంలో లోకేష్ సత్తా ఏమిటో ఇలా జనాలందరికీ తెలిసిపోతోంది. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు మళ్లీ లోకేష్ ను అత్యంత ప్రభావ శీల నేతగా అభివర్ణిస్తూ ఆయన పరువును తీస్తోంది తెలుగుదేశం అనుకూల మీడియా. లోకేష్ ను ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల యువనేతగా అభివర్ణించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు తీవ్రంగా పడుతున్నాయి.