Home రాజకీయాలు నందమూరి ఫ్యామిలీని బలిపశువుగా చేయడానికే!

నందమూరి ఫ్యామిలీని బలిపశువుగా చేయడానికే!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి సుహాసిని చేత పోటీ చేయించడం ఆమెను బలిపశువును చేయడమే అని అన్నాడు తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్. కూకట్ పల్లిలో ప్రచారం చేస్తూ కేటీఆర్ చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించాడు.

ఒకవేళ నందమూరి కుటుంబీకుల మీద చంద్రబాబుకు అంత ప్రేమే ఉంటే.. వారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడిగాడు. తనయుడు లోకేష్ కేమో.. చంద్రబాబు నాయుడు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు. ఒకవేళ నందమూరి కుటుంబీకుల మీద ఏమైనా ప్రేమ ఉంటే..వాళ్లకూచంద్రబాబు అలాంటి అవకాశం ఇవ్వాల్సింది.

తనయుడికేమో నామినేటెడ్ పదవిని ఇచ్చుకుంటాడు, మంత్రి పదవిని ఇచ్చుకుంటాడు. అదే నందమూరి కుటుంబీకులనేమో ఇలా పోటీ చేయిస్తున్నాడు.. ఇదే చంద్రబాబు రాజకీయం అని కేటీఆర్ విరుచుకుపడ్డాడు. నందమూరి సుహాసినిని పోటీ ఏచయించడం కాదు..దమ్ముంటే లోకేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సింది అంటూ కేటీఆర్ మరో సవాల్ ను విసిరాడు.

మరి ఇలాంటి సవాళ్లకు చంద్రబాబు కానీ.. ఆయన తనయుడు కానీ స్పందిస్తాడా.. అంత సీన్ ఏమీ ఉండదులే!