Home రాజకీయాలు పొత్తుల విషయంలో క్లారిటీ.. ప్రత్యర్థులకు జగన్ పంచ్!

పొత్తుల విషయంలో క్లారిటీ.. ప్రత్యర్థులకు జగన్ పంచ్!

SHARE

తాము ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉంది. అయితే జగన్ వ్యతిరేక మీడియా, టీడీపీ భజన మీడియా ఈ విషయంలో రకరకాల ప్రచారాలు చేస్తూ వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ వర్గాలు గట్టిగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చిన వైకాపా అధినేత జగన్ ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేశాడు.

తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని.. మోసపూరిత మాటలను నమ్మే ప్రసక్తి లేదని జగన్ స్పష్టం చేశాడు. రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని చెప్పిన జగన్… ఎవరైతే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తారో వారికే మద్దతు అని ప్రకటించాడు.

ఇప్పటి వరకూ ఏపీకి కాంగ్రెస్ ద్రోహం చేసిందని, బీజేపీ మోసం చేసిందని జగన్ అన్నాడు. వారితో కలిసి చంద్రబాబు రకరకాల డ్రామాలు ఆడాడన్నాడు. బీజేపీ మంచిది అంటూ నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు నాయుడు మోసం చేశాడని, ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదని అంటూ బాబు మోసం చేశాడని జగన్ వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు బాబు కాంగ్రెస్ తో కలిసి కొత్త వేషంతో వచ్చాడని.. కాంగ్రెస్ తో హోదా వస్తుందని అంటున్నాడని ఇలా కపట వేషం వేస్తున్నాడని అంటూ బాబు మీద జగన్ ధ్వజమెత్తాడు.

ఇక పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు పార్ట్ నర్ గా అభివర్ణించాడు జగన్. బాబు మోసంలో పవన్ కు వాటా ఉందన్నాడు. ఈ విధంగా ప్రత్యర్థులకు పంచ్ లు వేస్తూ.. ఎవరినీ నమ్మే ప్రసక్తి లేదని జగన్ స్పష్టం చేశాడు.