Home రాజకీయాలు జగన్ పై హత్యాయత్నం.. ఏపీ ప్రభుత్వానికి కోర్టు అక్షింతలు!

జగన్ పై హత్యాయత్నం.. ఏపీ ప్రభుత్వానికి కోర్టు అక్షింతలు!

SHARE

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం విషయంలో ఏపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై జరిగిన హత్యాయత్నంపై థర్డ్ పార్టీ చేత విచారణ చేయించాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ తో సహా ఈ అంశంలో దాఖలైన వివిధి వ్యాజ్యాలను హై కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రెండు వారాల కిందట ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి, మరి కొందరికి హై కోర్టు నోటీసులు జారీ చేసింది.

జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా కోరింది. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మెదల్లేదు. డైరెక్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిన నోటీసులకు స్పందిచంలేదు. రెండు వారాల గడువు ఇచ్చినా హై కోర్టులో ఎలాంటి అఫిడవిట్ నూ ఏపీ ప్రభుత్వం వేయలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాముకోరినా ఎందుకు అఫిడవిట్ ను దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరుతో విచారణ వాయిదా పడింది. విచారణను సోమవారానికి వాయిదా వేసిన కోర్టు.. ఆ రోజున అఫిడవిట్ ను దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది.
మరి ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం చాలా తేలిక చేస్తోంది. అందుకే అఫిడవిట్ ను కూడా దాఖలు చేయకుండా కోర్టు చేత చీవాట్లు పెట్టించుకుంటోంది.