Home రాజకీయాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ 37,ఇదీ పవన్ లెక్క!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ 37,ఇదీ పవన్ లెక్క!

SHARE

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తనే గెలిపించానని అంటున్నాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. తన మద్దతు మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారం సాధించుకుందని పవన్ అంటున్నాడు. ఇప్పటి వరకూ ఈ అంశంపై సూటిగా స్పందించని పవన్.. తాజాగా మాట్లాడుతూ.. తనే గనుక లేకపోతే గత ఎన్నికల్లో టీడీపీ కేవలం ముప్పై ఏడు సీట్లకు పరిమితం అయ్యేదని అన్నాడు. ఆ ముప్పై ఏడు సీట్లతో తెలుగుదేశం ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యేదని కూడా వపన్ అంటున్నాడు.

మరి ఇది పవన్ కల్యాణ్ కేవలం గత ఎన్నికల విషయంలో వేసిన లెక్క మాత్రమే కాదు.. వచ్చే ఎన్నికల విషయంలో వేసిన లెక్క కూడా అనుకోవాలి.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నిలిచిన చాలా సానుకూలాంశాల్లో ఒకటి పవన్ కల్యాణ్ మద్దతు. పవన్ తెలుగుదేశం పార్టీని గెలిపించాడో లేదో చెప్పలేం కానీ..చాలా చోట్ల పవన్ మద్దతు టీడీపీకి ఉపయోగపడిందని మాత్రం ఖాయంగా చెప్పవచ్చు. ఈ అంశం గురించి పవన్ స్పందిస్తూ.. తన వల్ల మాత్రమే టీడీపీ నెగ్గిందని లేకపోతే ఆ పార్టీకి ముప్పై ఏడు సీట్లే గతి అని అంటున్నాడు.

ఈ విషయాన్ని తెలుగుదేశం నేతలు సహజంగానే ఒప్పుకోరు. ఎందుకంటే.. పవన్ మద్దతు లేకపోయినా తాము గెలవగలిగే వాళ్లమని, మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో పవన్ మద్దతు తమకు లేదని.. అయినా వాటిల్లోనూ పై చేయిని సాధించామని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పవన్ మద్దతు టీడీపీకి ఉండదనే అనుకోవాలి. అందులో టీడీపీ ముప్పై ఏడుకు పరిమితం అయితే..గత ఎన్నికల్లో ఖాయంగా పవన్ వల్ల అధికారంలోకి వచ్చినట్టే!