Home ప్రత్యేకం ఫిరాయింపుదార్లపైనా అనర్హత వేటు..ఇదే హాట్ టాపిక్!

ఫిరాయింపుదార్లపైనా అనర్హత వేటు..ఇదే హాట్ టాపిక్!

SHARE

అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఈరన్న మీద హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు గానూ ఈరన్న మీద అనర్హత వేటు పడింది. అయితే ఇప్పటికే ఆ ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగున్నరేళ్లు కావొస్తున్నాయి. త్వరలోనే మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి ఇలాంటి నేపథ్యంలో అనర్హత వేటు పడినా పెద్ద నష్టం ఏమీ లేదనేది చాలా మంది మాట.

అయితే ఇప్పుడు కూడా అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఈరన్న చాలా ప్రయత్నించడాన్ని బట్టి, ఇంకా పదవీ కాలంఆరు నెలల వరకూ ఉండటంతో.. ఈ అనర్హత వేటు ఆసక్తిదాయకమే.మరి తప్పుడు వివరాలు చెప్పినందుకు గానూ ఈరన్న మీద అనర్హత వేటు పడింది.

ఇక ఫిరాయింపుదార్ల మీద వేటు ఎన్నడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నెగ్గిన ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే. వీరు కేవలం అధికారం కోసం జంప్ చేశారు. ఇలాంటినేపథ్యంలో..వీరిపై అనర్హత వేటు పడాల్సింది. ఇప్పటికే ఈ విషయంలో చాలా ఆలస్యం జరిగింది.

వీరిపై అనర్హత వేటు వేయాల్సిన అసెంబ్లీ స్పీకర్ అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో.. ఫిరాయింపుదార్లకు తిరుగు లేకుండా పోయింది. ఈ విషయంలో తీవ్రంగానే విమర్శలు వస్తున్నాయి. అయినా చర్యలు లేవు.ఈ వ్యవహారంపై కోర్టుకు కూడా వెళ్లింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.అయినా.. ప్రయోజనం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడటంతో.. ఫిరాయింపుదార్ల వ్యవహారం కూడా తేలిపోతుందేమో అనే చర్చ జరుగుతోంది. కనీసం ఇప్పుడు అయినా ఫిరాయింపుదార్ల మీద వేటు పడితే..వ్యవస్థ కొంతైనా తన పవర్ ను చూపించినట్టే. లేకపోతే ఫిరాయింపు చేసే వాళ్లకుఇకపై ఎలాంటి భయం ఉండదు!