Home రాజకీయాలు బీజేపీ.. తెలంగాణలో కష్టానికి ప్రతిఫలం ఉండబోతోందా!

బీజేపీ.. తెలంగాణలో కష్టానికి ప్రతిఫలం ఉండబోతోందా!

SHARE

గత ఎన్నికల్లో తెలంగాణలో ఒకింత మంచి ఫలితాలే పొందింది భారతీయ జనతా పార్టీ. రొటీన్ గా రెండు స్థానాల్లో మాత్రమే గెలిచే బీజేపీ ఒకింత సంచలనాలు నమోదు చేసింది. రాజా సింగ్ గెలవడం. ఖైరతాబాద్ సీటును బీజేపీ సొంతం చేసుకోవడం.. వంటివి అప్పట్లో ఆసక్తిదాయకమైన అంశాలు. అలాగే లోక్ సభకు కూడా అప్పుడే ఎన్నికలు జరిగాయి. దీంతో సికింద్రాబాద్ సీటును కూడా బీజేపీ సొంతం చేసుకుంది. అవి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసిన పరిణామాలే.

కానీ..అప్పట్లో బీజేపీకి అంత మంచి ఫలితాలు రావడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది అప్పుడున్న మోడీ హవా. ఆ పై తెలుగుదేశం సపోర్టు కూడా బీజేపీకి మేలు చేసింది. దీంతో పలు చోట్ల బీజేపీ సంచలనాలు నమోదు చేసింది. అయితే ఇప్పుడు మోడీ హవా నాటి రేంజ్ లో లేదు.తెలంగాణలో టీడీపీ సపోర్టు కూడా బీజేపీకి లేదు.

అయితే..గత నాలుగున్నరేళ్లలో బీజేపీ తెలంగాణలో చాలా కసరత్తు చేసింది. వివిధ రకాల సమీకరణాలతో జనాల్లోకి వెళ్లింది. తెలంగాణలో తమకు నిలదొక్కుకునే స్పేస్ ఉందని బీజేపీ భావించింది. దాని కోసం పలు ప్రయత్నాలు చేసింది. ఒక దశలో తెరాసకు ప్రత్యామ్నాయం తమే అన్నట్టుగా బీజేపీ పనిచేసింది. ఇప్పుడూ ఆ పార్టీ నేతలు అలాగే మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణలో బీజేపీ గెలిచేస్తుంది అనుకోవడం పొరపాటే.

ఇలాంటి నేపథ్యంలో ఇన్నాళ్లూ పడ్డ కష్టం.. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకులు తెలంగాణలో ప్రచారం చేస్తున్న తీరు.. ఇవి బీజేపీకి ఏ స్థాయి విజయాన్ని తెచ్చి పెడతాయి అనేది ఆసక్తిదాయంగా మారింది. మోడీ హవా లేకపోయినా, టీడీపీ సపోర్ట్ లేకపోయినా.. బీజేపీ గత ఎన్నికల స్థాయి ఫలితాలను సాధించినా…తెలంగాణలో చాలా మెరుగు పడినట్టే!