Home రాజకీయాలు కాంగ్రెస్ కు తెరాస ఝలక్.. అజ్జూభాయ్ టీఆర్ఎస్ లోకి?

కాంగ్రెస్ కు తెరాస ఝలక్.. అజ్జూభాయ్ టీఆర్ఎస్ లోకి?

SHARE

ఒకవైపు తెరాస నుంచి నేతలను చేర్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. తెరాసలో ఎంపీ హోదాలో ఉండిన విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లోకి చేరిపోయాడు. అలాగే ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కూడా జంప్ చేశాడు. ఈ జాబితాలో మరింతమంది ఉన్నారని కాంగ్రెస్ అంటోంది. ఎన్నికల కు ముందు ఇలాంటి పరిణామాలు తెరాసకు అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాయి. తామే ఎన్నికలు తెస్తే..ఇలాంటి ఎన్నికల ముందు తమ పార్టీ నుంచి నేతలు వీడటం ఏ పార్టీకి అయినా అసహనమే. దానికి తెరాస మినహాయింపు కాదు.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్ కు సిద్ధం అవుతోందట తెలంగాణ రాష్ట్ర సమితి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలోని నేతలకు తెరాస వల వేస్తోందని సమాచారం. ఇందులో మాజీ క్రికెటర్ అజరుద్ధీన్ పడ్డాడు అని సమాచారం. అజర్ ను తెరాస చేర్చుకోవాలని అనుకుంటోందట. దానికి ఆ మాజీ క్రికెటర్ కూడా ఓకే చెప్పాడని టాక్.

అజర్ కాంగ్రెస్ కు ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాడు. ప్రచారం కూడా చేస్తున్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో అజర్ కు కాంగ్రెస్ లో ప్రాధాన్యత దక్కేలా లేదు. తను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని అజర్ అనుకుంటున్నాడు. అయితే కాంగ్రెస్ లో ఆ అవకాశం దక్కేలా లేదు. సికింద్రాబాద్ నుంచి ఆ పార్టీకి అంజన్ కుమార్ యాదవ్ అభ్యర్థిగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఈ పార్టీలో ఎలాగూ ఛాన్స్ దక్కదని గ్రహించిన అజర్ తెరాసలో కర్చిఫ్ వేస్తున్నాడట. సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం ఇస్తే జాయిన్ అవుతానని అంటున్నాడట. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన కాంగ్రెస్ హై కమాండ్ అజర్ ను బుజ్జగిస్తోందని సమాచారం. కీలకమైన పదవి ఇస్తాము.. కాంగ్రెస్ లోనే ఉండు అని అజర్ ను బతిమాలుతున్నారని సమాచారం.