Home రాజకీయాలు ప్యాకేజ్ ల పవన్ కల్యాణ్.. నీ కామెడీకి హద్దు లేదా!

ప్యాకేజ్ ల పవన్ కల్యాణ్.. నీ కామెడీకి హద్దు లేదా!

SHARE

ప్యాకేజ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ మీద దుమ్మెత్తిపోస్తూ ఉంటారు అనేక మంది. చంద్రబాబు నాయుడు భారీ ప్యాకేజీతో పవన్ ను సొంతం చేసుకున్నాడనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. గత ఎన్నికల ముందు పవన్ కల్యాన్ చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వడమే పెద్ద డీల్ అని. దానికి భారీ ప్యాకేజీ కూడా దక్కిందనేది జనాభిప్రాయం.

ఇక ఎన్నికల తర్వాత కూడా పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసమే పని చేశాడు. బాబు పై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తినప్పుడల్లా పవన్ కల్యాణ్ జనం ముందుకు వచ్చాడు. బాబు కార్నర్ అవుతున్న సందర్భాల్లో పవన్ మీడియా ముందుకు వచ్చాడు. రకరకాలుగా హడావుడి చేశాడు. ఏదో విధంగా బాబును రక్షించేందుకు అప్పట్లో పవన్ కల్యాణ్ చాలా ప్రయత్నాలు చేశాడు.

ప్రత్యేకహోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే పవన్ కల్యాణ్ కూడా తెర మీదకు వచ్చాడు. హోదా వద్దు అనేది అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట.అందుకు అనుగుణంగా ప్యాకేజీ బాగుంది అని పవన్ కల్యాణ్ కూడా వ్యాఖ్యానించాడు. ఆ తర్వాతేమో హోదా గురించి తనొక్కడే పోరాడానని పీకే చెప్పుకుంటున్నాడు. విరామాల్లో రాజకీయం చేయడం కూడా పోరాటం అని పవన్ అనుకోవచ్చుగాక జనాలు మాత్రం అలా అనుకోరని పీకేకు తెలియదు కాబోలు.

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు కేపీ జగన్ ను లక్ష్యంగా చేసుకొని సాగుతున్నాడు. ఆఖరికి ఇప్పటి వరకూ సుజనా చౌదరి విషయంలో స్పందిచంలేదు. కానీ జగన్ మీద అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాడు. అందులో భాగంగా చంద్రబాబు అవినీతిలో జగన్ కు వాటాలున్నాయని పీకే వాగాడు.

మరి నాలుగున్నరేళ్లలో చంద్రబాబు నాయుడుపై జగన్ ఎంతగా పోరాడుతున్నాడో, ప్రతి విషయంలోనూ వైసీపీ ఎంతగా పోరాడుతోందో అంరదికీ తెలిసిందే. ఇదే నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ప్యాకేజీలకు అనుగుణంగా వ్యవహరించాడు పవన్. ఇప్పుడేమో జగన్ మీద ఇలా దుమ్మెత్తిపోస్తున్నాడు. ఈ బురద జగన్ కు అంటుకోదులే పవన్!