Home రాజకీయాలు జేడీ లక్ష్మినారాయణ…డీల్ అందుకే ఆగుతోందట!

జేడీ లక్ష్మినారాయణ…డీల్ అందుకే ఆగుతోందట!

SHARE

తనను ఎవరైనా సరే..ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేయాలి.. అనేది జేడీ లక్ష్మినారాయణ కోరిక అట. అందుకే ఈయన ఏ పార్టీలోనూ చేరలేకపోతున్నాడని, ఏ పార్టీలోకి చేరి రాజకీయం మొదలుపెట్టడానికీ ఈయన అందుకే ఆగుతున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఈయన రాజకీయాల్లోకి రావడానికి అంటూ ఉద్యోగాన్ని వదిలి వచ్చి చాలా కాలం అవుతోంది. అయితే ఇప్పటికీ ఏ పార్టీలోకి చేరాలనే అంశం మీద క్లారిటీ రావడం లేదట. ఈ విషయాన్ని ఈ మాజీ జేడీనే చెప్పాడు. తను ఏపార్టీలోకి చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని తాజాగా చెప్పాడు.

సొంతంగా పార్టీ పెడతాడను అని ప్రకటించిన ఈయన ఇప్పుడు మళ్లీ మాట మార్చాడు. తను ఏదో ఒక పార్టీలో చేరతాను అని, అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలున్నాయని జేడీ చెప్పాడు. మరి ఏ పార్టీలోకి ఎందుకు చేరడం లేదు.. అంటే.. ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని సదరు పార్టీలను కోరుతున్నాడట. వివిధ కారణాలతో ఏ పార్టీ కూడా అందుకు సిద్ధంగా లేదు. అందుకే ఈయన ఎటూ చేరలేకపోతున్నాడని సమాచారం.

జగన్ కేసులను పరిశోధిస్తున్నాడని అప్పట్లో ఈయనను జగన్ వ్యతిరేక మీడియా హీరోని చేసింది. దాన్ని చూసుకుని ఈయన చాలా ఎక్కువ ఫీలవుతున్నాడని, తను ముఖ్యమంత్రిని అయిపోతాను అనే భ్రమలో ఈయన ఉన్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తీరు వల్లనే ఈయన ఏ పార్టీలోనూ ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడనేది గట్టిగా వినిపిస్తున్న మాట!