Home రాజకీయాలు లేటు వయసులో బాబును తిప్పలు పెడుతున్న లోకేష్!

లేటు వయసులో బాబును తిప్పలు పెడుతున్న లోకేష్!

SHARE

మొత్తానికి లోకేష్ ను ఎక్కడో ఒక చోట పోటీ చేయించాలి.. వచ్చేసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే చంద్రబాబు నాయుడు తనయుడికి అంతకన్నా అవమానం లేదు. ఇప్పటికే లోకేష్ ను ప్రత్యర్థులు తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి రాకుండా.. నామినేటెడ్ పదవితో మంత్రిగా సాగుతుండటంపై ప్రత్యర్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

లోకేష్ దద్దమ్మ అని, చేతగాని వ్యక్తి అని.. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే అలాంటి విమర్శలు వినపడినా వినపడనట్టుగా ఉన్నాడు లోకేష్. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశంపై చాన్నాళ్ల నుంచినే కసరత్తు సాగుతూ ఉంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా కసరత్తే చేయిస్తున్నాడట. లోకేష్ కు అనుకూలమైన నియోజకవర్గం ఏదనే అంశం మీద బాబు పలు సర్వేలు చేయించుకున్నట్టుగా సమాచారం.

అందులో రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారట. చివరకు తేలింది ఏమిటంటే.. కుప్పం నుంచి మాత్రమే లోకేష్ పోటీ చేయడం సేఫ్ అనేది.

కుప్పంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి లోకేష్ పోటీ చేస్తే గెలుపు ఈజీ అని..అనుకుంటున్నారట. మరి కుప్పంలో లోకేష్ పోటీ చేస్తే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటి అనేది పెద్ద డౌట్.

అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరే నియోజకవర్గాన్ని వెదుక్కొంటున్నాడట. ఈ విషయంలోనూ చాలా స్టడీనే జరిగిందట. అందులో భాగంగా బాబు కల్యాణ దుర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా పలు నియోజకవర్గాలను ఎంచుకుని వాటిల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేయించుకుంటున్నాడట చంద్రబాబు నాయుడు. మొత్తానికి లేటు వయసులో చంద్రబాబును లోకేష్ ముప్పు తిప్పలు పెడుతున్నట్టుగా ఉన్నాడు.