Home రాజకీయాలు జగన్ పై పవన్ అందుకే తీవ్ర స్థాయిలో అలా..!

జగన్ పై పవన్ అందుకే తీవ్ర స్థాయిలో అలా..!

SHARE

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ విషయంలో పవన్ తీరు సందేహంగా మారుతోంది. పవన్ కల్యాణ్ ఇంతకీ ఏం మాట్లాడుతున్నాడు.. అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడా, లేక జగన్ అధికారంలో ఉన్నాడని పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడా.. అనే సందేహాలు కలుగుతున్నాయి.

దీనికంతా కారణం పవన్ కల్యాణ్ మాట తీరే. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే మాట చెబుతోంది. ఇంతకీ పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున పని చేసుకుంటున్నాడా లేక చంద్రబాబు నాయుడు అజెండాను అమలు పెడుతున్నాడా అనే సందేహాలను వ్యక్తం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఇంతకీ జగన్ మీద పవన్ కల్యాణ్ ఎందుకు ఇంతలా విరుచుకుపడుతున్నాడు అంటే.. దీని వెనుక పవన్ కల్యాణ్ ఆందోళన ఉందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ గత కొన్నాళ్లుగా కేవలం ఉభయగోదావరి జిల్లాలకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు పరిమితం అయ్యాడు. ఆ జిల్లాల చుట్టూరానే పవన్ తిరుగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నాడట జనసేన అధిపతి.

అందులో తేలినది ఏమిటంటే..పవన్ అంతగా కష్టపడినా అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉందని పవన్ చేయించుకున్న సర్వేలో తేలిందని సమాచారం. అక్కడ టీడీపీ ఎప్పుడో జీరో అయిపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా జగన్ పార్టీ హవా చూపిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ కు అసహనం ఎక్కువ అవుతోంది. అందుకే జగన్ మీద ఇలా మాట్లాడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. జగన్ మీద పవన్ అంతగా ఎగెరెగిరి పడటం వెనుక రీజన్ ఇదనే మాట వినిపిస్తోంది.