Home రాజకీయాలు ఎన్టీఆర్ తో చంద్రబాబు ఆట.. విలవిల్లాడుతున్న జూనియర్!

ఎన్టీఆర్ తో చంద్రబాబు ఆట.. విలవిల్లాడుతున్న జూనియర్!

SHARE

కూకట్ పల్లి సీటును నందమూరి సుహాసినికి ఇవ్వడంలో ముందుగా ఆ కుటుంబీకులను ఎవ్వరినీ చంద్రబాబు నాయుడు సంప్రదించనట్టుగా తెలుస్తోంది. హరికృష్ణ కూతురుకు టికెట్ ను ఇవ్వడం విషయంలో చంద్రబాబు నాయుడు హరికృష్ణ కొడుకులను ఎవరినీ సంప్రదించనట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడు.

ఇలా నందమూరి కుటుంబంతో ఆటలు ఆడటం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదు. ఇలా బాబు మొదలుపెట్టిన గేమ్ లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా ఇరుక్కుపోయాడని సమాచారం. తనను ఏమీ అడగకుండానే తన సోదరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా దించాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జూనియర్ ఆమె తరఫున ప్రచారం చేస్తే అది చంద్రబాబు ఆదేశాలను అనుసరించడమే.

అలా కాకుండా ఆమెకు అనుకూలంగా ప్రచారం చేయకపోతే.. కుటుంబం మొత్తం దూరం అవుతుంది. తారక్ ఇప్పుడిప్పుడే నందమూరి కుటుంబానికి పూర్తిగా దగ్గర అవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో సుహాసినికి అనుకూలంగా ప్రచారం చేయకపోతే.. నందమూరి కుటుంబీకులకు తారక్ మళ్లీ దూరం అవుతాడు. అలాగని ప్రచారం చేస్తే.. చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమ్ లో పాత్రధారి అవుతాడు తారక్.

ఇప్పటికే సుహాసినికి అనుకూలంగా ట్వీట్ పెట్టాడు తారక్. అందులో ఎక్కడా చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకురాలేదు. మరి రేపు ప్రచారానికి అయితే తప్పకుండా వెళ్లాల్సి వచ్చేలా ఉంది. మరి అప్పుడు కూడా తారక్ చంద్రబాబు నాయుడి ప్రస్తావన తీసుకురాకుండానే ప్రచారాన్ని కంప్లీట్ చేస్తాడా అనేది ఆసక్తిదాయకమైన అంశం!