Home రాజకీయాలు తెలంగాణ టీడీపీ.. గెలిచే ఆ ఇద్దరు అదృష్టంతులెవరు?

తెలంగాణ టీడీపీ.. గెలిచే ఆ ఇద్దరు అదృష్టంతులెవరు?

SHARE

మహాకూటమికి ప్రజల తిరస్కరణ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. కూటమి అంటే అది ఆ యా పార్టీల కార్యకర్తలకే ఇష్టం లేనిదని మొదటి నుంచి అంటున్నారు. దశాబ్దాల వైరంతో ఊగిపోయిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ల కార్యకర్తలు ఇప్పుడు కూటమి అనగానే గతాన్ని మరిచి ఒకరితో ఒకరు చేతులు కలిపే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. ఇక సామాన్య ప్రజానీకం కూడా కాంగ్రెస్ టీడీపీలు చేతులు కలపడాన్ని దిగజారుడు చూస్తున్నారనేది స్పష్టం అవుతున్న విషయమే.

ఈ విషయంలో చంద్రబాబు నాయుడే కార్నర్ అవుతున్నాడు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన పార్టీని ఇలా కాంగ్రెస్ కాళ్ల ముందు పడేశాడని అనేక మంది బాబు తీరును తప్పు పడుతూ ఉన్నారు.

మరి ఇలాంటి పరిస్థితుల నడుమ.. టీడీపీ, కాంగ్రెస్ లను జనాలు ఆశీర్వదించే అవకాశాలు లేవని అనేక మంది అభిప్రాయపడుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి సర్వేల ఫలితాలు. తెలంగాణలో మహాకూమి వర్కవుట్ కాదని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది.

తెరాస ఏకంగా డెబ్బై స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ఈ సర్వే తేల్చింది. అదే మహాకూటమి కేవలం ముప్పై మూడు స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. అందులో కాంగ్రెస్ వాటా ముప్పై ఒకటి కాగా.. టీడీపీ వాటా కేవలం రెండంటే రెండే అని ఈ సర్వే పేర్కొంది.
తెలంగాణలో టీడీపీ పదమూడు సీట్లకు పోటీ చేస్తోందని అనుకున్నా.. ఆ పార్టీ కేవలం రెండంటే రెండు చోట్ల మాత్రం నెగ్గుతుందని జాతీయ మీడియా సర్వే చెబుతోంది. మరి టీటీడీపీలో అలా నెగ్గగల ఇద్దరు లక్కీ ఫెలోస్ ఎవరో!