Home రాజకీయాలు కాంగ్రెస్.. ఇంకేం చేయలేక.. చివరికలా..!

కాంగ్రెస్.. ఇంకేం చేయలేక.. చివరికలా..!

SHARE

తమ పార్టీ రెబల్స్ ను కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయలేకపోయింది. చివరకు వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జనాల్లో ఉన్న ఊపు ఏమిటో కానీ.. ఆ పార్టీలో మాత్రం టికెట్లకు చాలా లొల్లి జరిగింది. అనేకమంది టికెట్లు మాకంటే మాకు అని పోట్లాడుకున్నారు.

ఒక్కోచోట కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువమంది ఆశావహులు కనిపించారు. ఒక్కో సీట్లు ఇద్దరు ముగ్గురు ఆశావహులు కనిపించారు. ఇక మరో వైపు కూటమి కాంగ్రెస్ లో రెబల్స్ ను మరింతగా రేపింది. టీడీపీ, తెలంగాణజనసమితి, సీపీఐలకు కాంగ్రెస్ ఇచ్చిన సీట్లలో రెబల్స్ రంగంలోకి దిగారు.

ఇలాంటి వాళ్లను కాంగ్రెస్ పార్టీ బతిమాలింది, బుజ్జగించింది. రకరకాలుగా వాళ్ల మీద ఒత్తిళ్లు తీసుకువచ్చింది. దీంతో కొంతమంది అయితే రంగం నుంచి తప్పుకున్నారు. ఈ విషయంలో పక్క రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగారు, దీంతో.. కొందరు తప్పుకున్నారు కానీ..ఇంకా ఏడెనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు రెబల్స్ అలాగే నిలిచారు. దీంతో చేసేది లేక వాళ్లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

మరి వాళ్లే కాంగ్రెస్ అవసరం లేదని స్వతంత్రులుగా రంగంలోకి దిగితే.. ఇప్పుడు కాంగ్రెస్ బహిష్కరణ అంటోంది. దీని వల్ల వాళ్లకు వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు!