Home రాజకీయాలు ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ గురించి పవన్ మాటలు.. బూమరంగ్!

ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ గురించి పవన్ మాటలు.. బూమరంగ్!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు చేర్చుకున్నాడు. ఇది ఇప్పుడు జరిగింది కాదు. మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నదే. అయితే ఈ ఫిరాయింపు పర్వంపై పవన్ కల్యాణ్ అప్పుడు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నది అనైతికం అని పవన్ కు అప్పుడు అనిపించలేదు. ఈ విషయంలో జనసేన అధిపతి అప్పుడు నోరు మెదపలేదు.

ఇప్పటికీ ఈయన ఈ విషయంలో చంద్రబాబును గట్టిగా కడిగేయడం లేదనుకోండి. ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు చర్యలను పవన్ సమర్థిస్తున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని మాత్రం పవన్ కల్యాణ్ తెగ తప్పు పట్టేస్తూ ఉన్నాడు.

ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ.. ప్రజాస్వామ్యం.. అంటూ పీకే ఏకేస్తున్నాడు. ఇదే సమయంలో తనకే గనుక ఎమ్మెల్యేలు ఉంటే ఏదో ఉద్ధరించేసే వాడిని అన్నట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడటం మరో కామెడీ.

ఎందుకంటే.. పవన్ కల్యాణ్ వెంట ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కాదు.. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు. ఆ పార్టీలో పవన్ కల్యాణ్ కీలక నాయకుడు.ఆ పార్టీ తరఫున పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. అప్పట్లో వాళ్లతో చిరంజీవి లోఏం చేశాడో అందరికీ తెలిసిందే.

వాళ్లను కాంగ్రెస్ విలీనం చేసి.. ఒక రాజ్యసభ సీటును కేంద్రమంత్రి పదవిని పొందాడు చిరంజీవి.మరి అప్పుడు పవన్ కల్యాణ్ కు విలువలు గుర్తుకురాలేదు. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లాలనే విషయం గుర్తుకు రాలేదు. ఇప్పుడు మాత్రం ఏవో నీతులు చెబుతున్నాడు. మరి తమ చరిత్రను జనాలంతా మరిచిపోయి ఉంటారనేది పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడా!