Home సినిమా ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి`

ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి`

SHARE

తెలుగు సినిమాని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన “షోయింగ్ బిజినెస్” అనే పేరు తో నిర్మాణ సంస్థ స్థాపించారు. తొలిసారి కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి`. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు, సింగ‌ర్ కాల‌భైర‌వ ఈ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తుండ‌గా, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుండి ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.

ఈ చిత్రానికి సౌండ్ డిజైన్‌: ర‌ఘునాథ్‌.కె, కాస్ట్యూమ్స్‌: సంజ‌నా శ్రీనివాస్‌, కాస్టింగ్ డైరెక్ట‌ర్‌: మ‌హ‌తి బిక్షు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: మోహ‌న్ నాథ్ ఎస్‌.బింగి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ‌శాంక్‌, స్క్రీన్ ప్లే: అశ్విన్ గంగ‌రాజు, సందీప్ రాజ్‌, సాయికుమార్ రెడ్డి, నిర్మాత‌: ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, ద‌ర్శ‌క‌త్వం: అశ్విన్ గంగ‌రాజు.