Home రాజకీయాలు టీడీపీ మాజీ మంత్రి.. జనసేన రూటులో..!

టీడీపీ మాజీ మంత్రి.. జనసేన రూటులో..!

SHARE

చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేసిన రావెల కిషోర్ బాబు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టుగా సమాచారం. ఈయన జనసేనలోకి చేరడం దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. మాదిగసామాజికవర్గానికి చెందిన ఈయనను పవన్ కల్యాణ్ చేర్చుకోవచ్చని తెలుస్తోంది. పవన్ కు ఎస్సీల ఓట్లపై చాలా ఆశలున్నాయి. అందుకే రావెల వంటి వారిని చేర్చుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

రావెల వచ్చేసారి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నాడని.. తెలుగుదేశంలో అయితేఎమ్మెల్యే టికెట్ కూడా దక్కడం కష్టం అని..అందుకే జనసేన వైపు చూస్తున్నాడని ప్రచారం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అవినీతి వ్యవహారాల గురించి కూడా రావెల బోలెడు సమాచారం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. తనను అర్ధాంతరంగా మంత్రి వర్గం నుంచి తొలగించిన బాబు పై కక్ష తీర్చుకునేందుకు రావెల కూడా ఉత్సాహంగా ఉన్నాడని..అందుకే జనసేనలోకి చేరనున్నాడని ప్రచారం జరుగుతోంది.

అయితే రావెల వివాదాస్పదుడు. తన తీరుతో వివాదాల్లో చిక్కుకున్నాడు. అలాగే రావెల తనయుడు హైదరాబాద్ లో ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. అది అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. చివరకు కేసీఆర్ కేబినెట్లోని ఒక దళిత మంత్రి సహకారంతో అప్పట్లో రావెల తనయుడు బయటపడ్డాడని తెలుస్తోంది. మరి ఇలాంటి వివాదాస్పద నేతను తన పార్టీలోకి పవన్ చేర్చుకుని మరిన్ని విమర్శల పాలవుతాడేమో చూడాలి!