Home రాజకీయాలు పెట్రోల్ ధరల్లో భారీ తగ్గుదల..బీజేపీకి కొత్త జోష్!

పెట్రోల్ ధరల్లో భారీ తగ్గుదల..బీజేపీకి కొత్త జోష్!

SHARE

గత కొద్ది రోజులుగా పెట్రో ధరల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకుంటోంది. ప్రతి రాష్ట్రంలోనూ ఆయా స్థానిక పన్నులను కలుపుకున్నా.. పెట్రోల్ ధర లీటర్ కు ఏడెనిమిది రూపాయల వరకూ తగ్గింది. గత నెల రోజుల్లో పెట్రోల్ ధరలు పెరిగిందేమీ లేదు. వీలైనంతగా తగ్గుదలే నమోదు అవుతోంది. ఓవరాల్ గా ఏడెనిమిది రూపాయలు తగ్గడం అంటే మాటలు కాదు.

రాష్ట్ర పన్నులు తక్కువగా ఉన్న కర్ణాటక వంటి రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర డెబ్బై ఏడు రూపాయల దశకు వచ్చింది. కేంద్ర పన్నులు తగ్గడంలో ఈ తగ్గుదల నమోదు అయ్యింది.అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ధర బాగానే తగ్గింది ఈ మధ్య. ఈ నేపథ్యంలో చమురు కంపెనీలకు కూడా పెద్దగా నష్టం వాటిల్లడం లేదు. పెట్రోల్ ధరలు బాగానే తగ్గడం వినియోగదారులకు ఊరటను ఇచ్చే అంశంగా మారింది.

పెట్రోల్ ధరల్లో గత కొంతకాలంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ఒక దశలో వంద రూపాయలకు చేరిపోతుందేమో అనే అభిప్రాయం కూడా వినిపించింది. కానీ అక్కడ నుంచి తగ్గుదల నమోదవుతూ వస్తోంది.

ఒకవైపు ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పెట్రో ధరల్లో తగ్గుదల బీజేపీకి కాస్తసానుకూలంశమే. ఒకవేళ తగ్గుదల నమోదు కాకపోతే.. పెట్రోల్ ధరలు అలాగే పెరుగుతూ ఉంటే బీజేపీపై ఓటర్లలో కోపం మరింత పెరిగేది. ఇప్పుడు పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయని చెప్పి ఓటర్లు ఎవరూ కొత్తగా బీజేపీ వైపు మొగ్గు చూపకపోయినా.. వ్యతిరేకత మాత్రం కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ఇది బీజేపీకి జోష్ ఇస్తున్న అంశం.