Home రాజకీయాలు రెడ్డి సెంటిమెంట్.. కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

రెడ్డి సెంటిమెంట్.. కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

SHARE

తెలంగాణలో ఆఖరి నిమిషంలో కొత్త ప్లాన్ ను అమలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అదే రెడ్డి సెంటిమెంట్ ను ఉపయోగించుకోవడం. ప్రస్తుతం కేసీఆర్ ఆధ్వర్యంలో వెలమ దొరల పాలన నడుస్తోందని.. రెడ్డి రాజ్యం కావాలని.. అది రావాలంటే రెడ్లంతా ఒక గొడుగు కిందకి రావాలని..అది కాంగ్రెస్ పార్టీనే అని వీళ్లు ప్రచారం చేస్తున్నారు. దానికి తోడు తెరాసలోని రెడ్డి నేతలు కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాట పట్టడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిదాయకంగా మారింది.

మొన్న కొండా విశ్వేశ్వర రెడ్డి తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కాంగ్రెస్ వైపు వచ్చాడు. ఇలా రెడ్డి నేతలను తెరాస నుంచి కాంగ్రెస్ తెచ్చుకుంటోంది. తద్వారా ఓటర్లకు కూడా రెడ్డి రాజ్యం అనే సంకేతాలను ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ.

అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న స్థితిలో రెడ్డి రాజకీయం సాధ్యం అవుతుందా అనేది సందేహమే. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ వెంట చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సెంటిమెంట్ ను ప్రయోగించినా అది వర్కవుట్ కావడం కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు.

కోదండరాం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినప్పుడే అది రెడ్డి రాజ్యం సాధనకే అని ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి కూడా ఈ తరహాలో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు తెరాస నుంచి రెడ్డి నేతలనే ప్రత్యేకంగా చేర్చుకుంటూ ఉన్నారు. మరి ఈ పాలిటిక్స్ తో ప్రయోజనం ఉంటుందా.. రెడ్లు కాంగ్రెస్ పాలనను కోరుకుంటారా లేదా అనే అంశం డిసెంబర్ పదకొండో తేదీకి కానీ తెలియదు!