Home రాజకీయాలు తెలంగాణ.. వెనక్కు తగ్గిన రెబెల్స్.. చాలా చోట్ల విత్ డ్రా!

తెలంగాణ.. వెనక్కు తగ్గిన రెబెల్స్.. చాలా చోట్ల విత్ డ్రా!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని మరింత రసవత్తరంగా మార్చిన ప్రధాన పార్టీల రెబెల్ అభ్యర్థులు ఆఖరి నిమిషంలో వెనక్కు తగ్గారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల రెబల్స్ రంగంలోకి దిగారు. తమకు టికెట్ దక్కలేదనే బాధతో వీరు తిరుగుబాటు చేశారు. ఇండిపెండెంట్స్ గా నామినేషన్స్ దాఖలు చేశారు. అంత వరకూ పార్టీ టికెట్ పై ఆశలు పెట్టుకుంటే తమ కోరికను తీర్చకుండా మరొకరికి అవకాశం ఇస్తారా అంటూ వీళ్లు రంగంలోకి దిగారు.

ఇక నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు రోజున మాత్రం వీరిలో చాలా మంది వెనక్కు తగ్గారు. తాము పోటీలో ఉండకుండా తప్పుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు మచ్చెమటలు పట్టించిన వాళ్లు ఇలా తప్పుకున్నారు.

రెబల్స్ బరి నుంచివ తప్పుకున్న కీలకమైన నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి, కోదాడ, మేడ్చల్, కుద్బుల్లాపూర్, మిర్యాలగూడ, వరంగల్ పశ్చిమ వంటి నియోజకవర్గాలున్నాయి.

శేరిలింగంపల్లిలో రెబల్స్ అటు కాంగ్రెస్ కు ఇటు తెలుగుదేశం పార్టీకి టెన్షన్ పెట్టారు. కాంగ్రెస్ నుంచి కూన వెంకటేశ్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నుంచి మొవ్వా సత్యనారాయణ రెబల్స్ గా రంగంలోకి దిగారు. వీళ్లు తమ పార్టీ లనుంచి టికెట్ ఆశించారు. అయితే ఛాన్స్ లభించకపోయే సరికి..రెబల్స్ గా రంగంలోకి దిగారు. ఇద్దరూ కలిసి టీడీపీ అభ్యర్థి ఆనందప్రసాద్ ను టెన్షన్ పెట్టారు. అయితే వీళ్లు చివరకు రాజీ పడ్డారు. నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు.

ఙక మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యను టెన్షన్ పెట్టిన అభ్యర్థి రంగం నుంచి తప్పుకున్నాడు. నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. అలాగే కుద్బుల్లాపూర్లో కూడా రెబల్ వెనక్కు తగ్గాడు. తెరాసను కూడా కొన్ని చోట్ల రెబల్స్ కంగారు పెట్టారు. అయితే వారిలో కొందరు వెనక్కు తగ్గారు.
ఇలా చాలా మంది వెనక్కుతగ్గినా మరి కొందరు మాత్రం పోటీలోనే ఉండటం విశేషం. అయితే చాలా వరకూ రెబల్స్ పోటు తగ్గిందని మాత్రం చెప్పవచ్చు.