Home రాజకీయాలు ప్రత్యర్థులు హ్యాపీః పవన్.. ఇలా మాట్లాడుతూ ఉంటే చాలు!

ప్రత్యర్థులు హ్యాపీః పవన్.. ఇలా మాట్లాడుతూ ఉంటే చాలు!

SHARE

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడుతూ ఉంటే చాలు అని అనుకుంటున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. జనసేన అధిపతి ఒక రోజు మాట్లాడినట్టుగా మరో రోజు మాట్లాడడు. ఒక రోజేమో ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా అనుకుంటే అది పాపం అంటాడు. మరో రోజేము తను ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటున్నట్టుగా చెబుతాడు. జగన్ సీఎం అనుకోవడం పాపం..తను సీఎం కావాలని అనుకోవడం పుణ్యం అన్నట్టుగా పీకే చెబుతూ ఉంటాడు, మరో రోజేమో తనకే సీఎం కావాలని లేదని అంటాడు.

ఇలా తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు.. అన్ని విషయాల్లోనూ పవన్ కల్యాణ్ వి డబుల్ స్టాండర్డ్స్, రెండు రకాల మాటలు. ద్వంద్వ వైఖరి. ఇలా సాగుతూ ఉంది ఈ సినిమా హీరో రాజకీయం.

అసలుకు మూడు నాలుగు జిల్లాల చుట్టూరానే తిరుగుతూ రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్ తను ముఖ్యమంత్రి అవుతానని అనడం కామెడీ. అసలుకు ఆ జిల్లాల్లో అయినా పటిష్టమైన నాయకత్వం, క్యాడర్ ఉందా అంటే అదీ లేదు. తిరుగుతున్నదే రెండు జిల్లాల్లో. అక్కడా రూపు రేఖలు లేవు. ఈ మాత్రం దానికే తను సీఎం అయిపోతానని పీకే చెబుతున్నాడు.

అంటే మిగతా రాష్ట్రం అక్కర్లేదు. తన కుల జనాభా ఎక్కువగా ఉన్న రెండు జిల్లాలతోనే తను అధికారంలోకి వచ్చేస్తానన్న భ్రమలో ఉన్నాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు ప్రత్యర్థులను కదిలిస్తే.. పవన్ ఇలా కొనసాగితే చాలు అని వారు అంటున్నారు. పవన్ ఇలా మాట్లాడుతూ ఉంటే.. ప్రజలు అతడి తీరును అర్థం చేసుకుంటారని, అతడిని తిరస్కరించడానికి అతడు ఇలా వ్యవహరించమే కావాల్సిందల్లా.. తాము ప్రత్యేకంగా పవన్ గురించి వ్యూహాలు రచించాల్సిన అవసరం లేదని పవన్ ఇలా సాగుతూ పోతే చాలని వారు అంటున్నారు.