Home ప్రత్యేకం జగన్ పాదయాత్ర.. టీడీపీకి మరింత టెన్షన్ గా మారింది!

జగన్ పాదయాత్ర.. టీడీపీకి మరింత టెన్షన్ గా మారింది!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఆదరణ పెరుగుతూ పోవడమే తప్ప.. ఎక్కడా టీడీపీకి ఊరటను ఇచ్చేలా లేదు. ఫలానా ప్రాంతంలో, ఫలానా నియోజకవర్గంలో, ఫలానా ఏరియాలో జగన్ పాదయాత్రకు తక్కువ రెస్పాన్స్ వచ్చింది.. అనే లెక్కే లేకుండా.. ఎటు చూసినా జగన్ పాదయాత్రకు ఒకే రీతిన స్పందన వస్తూ ఉండటం గమనార్హం.

సొంత నియోజకవర్గం పులివెందుల్లో మొదలుపెట్టినప్పుడు జగన్ కు ఏ స్థాయిలో జనస్పందన కనిపించిందో.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే రీతిన పాదయాత్రకు ప్రజాస్పందన కనిపిస్తోంది. రాజకీయ పరిణామాల గురించి చెప్పడానికి, పొలిటికల్ సిట్చుయేషన్ గురించి వివరించడానికి పార్టీలు రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విడదీసి చెబుతూ ఉంటారు. రాయలసీమ, కోస్తా, ఆంధ్ర,, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర అంటూ మాట్లాడుతూ ఉంటారు. అయితే జగన్ పాదయాత్రకు మాత్రం ఇలాంటి తేడాలు ఏమీ కనిపించడం లేదు.ప్రాంతాలకు అతీతంగా ఒకే స్థాయి ఆదరణ కనిపీస్తూ ఉంది.

అలాగే కకులా ప్రభావం గురించి కూడా చెబుతూ ఉంటారు. ఫలానా ఏరియాలో ఫలానా కులం వారి ఆధిపత్యం, ఫలానా ఏరియాలో ఫలానా కులాల ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తూ ఉంటారు. అయితే ఏ కులం వారు ఎక్కడ ఎక్కువ ఉన్నా.. జగన్ పాదయాత్రకు మాత్రం అంతటా ఒకే రీతిన అద్వితీయ స్పందన కనిపిస్తూ వస్తోంది.

ఒకవేళ జగన్ పాదయాత్రకు ఎక్కడైనా ఆదరణ తగ్గినట్టుగా కనిపించినా, ఎక్కడైనా జనస్పందన తక్కువైనా తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు ఏ మాత్రం వదిలేవి కావు. జగన్ పాదయాత్రను తెలుగుదేశం అనుకూల మీడియా చూపించకపోవచ్చు గాక.. కానీ ప్రతిక్షణం డేగకన్నుతో అవి పరిశీలిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడైనా జగన్ దొరికితే అవి వదిలేవి కావు. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడా టీడీపీ అనుకూల మీడియాకు చిక్కని రీతిలో.. ఒకే స్థాయి ఆదరణ అభిమానాలతో జగన్ పాదయాత్ర కొనసాగుతూ ఉంది.
రాష్ట్రం అంతటా ఒకే రీతిన జగన్ పాదయాత్రకు స్పందన రావడం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం మింగుడు పడే అంశంలా కనిపించడం లేదు.