Home రాజకీయాలు బాబు ఆస్తుల ప్రకటన.. నేషనల్ మీడియాలో హైలెట్!

బాబు ఆస్తుల ప్రకటన.. నేషనల్ మీడియాలో హైలెట్!

SHARE

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం చేసిన ఆస్తుల ప్రకటన… జాతీయ స్థాయిలో కామెడీగా మారింది. చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రతియేటా ఈ కామెడీ చేస్తూ ఉంటుంది. ఎవ్వరూ నమ్మరు..నవ్వుల పాలవుతాం.. అనేభయం ఏమీ లేకుండా బాబు ఫ్యామిలీ ఈ కామెడీని కొనసాగిస్తూ ఉంది. ఈ విషయంలో ముందుగా చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చేవాడు. తర్వాత బాబు తనయుడు లోకేష్ ఈ బాధ్యతను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో తండ్రి మొదలుపెట్టిన కామెడీని లోకేష్ కొనసాగిస్తూ ఉన్నాడు.

బాబు కుటుంబం చేసే ఈ ఆస్తుల ప్రకటన నంబర్లు హాస్యాస్పదంగా ఉంటాయి. ఒక ఏడాది చెప్పే నంబర్లకూ మరో ఏడాది చెప్పే నంబర్లకు పొంతన ఉండదు. అసలు ఈ ఆస్తుల ప్రకటన చేసేది మార్కెట్ విలువ ప్రకారం కాదు అని.. ఎప్పుడో కొన్నప్పటి విలువ ప్రకారం అనేది కూడా తెలిసిన విషయమే.

ఇక ఆస్తుల ప్రకటన తామొక్కరం మాత్రమే చేస్తున్నామని..దేశంలో మరే రాజకీయ నేతా చేయడం లేదని చంద్రబాబు కుటుంబం ప్రకటించుకుంటూ ఉంటుంది. ఇది కూడా హాస్యాస్పదమే. ఎందుకంటే.. దేశంలో ప్రతి ప్రజాప్రతినిధి ఎన్నికల్లో పోటీ చేసేముందు తమ ఆస్తుల ప్రకటన చేస్తూ ఉంటాడు. అయితే తాము మాత్రమే ఇలా చేస్తున్నామని లోకేష్ చెప్పుకుంటున్నాడు.

ఇక తాజాగా లోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన కామెడీగా మారి..అది నేషనల్ మీడియాలో కూడా హైలెట్ అవుతూ ఉంది. జాతీయ మీడియా బాగా హైలెట్ చేస్తున్న విషయం చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తుల కన్నా ఆయన మనవడి పేరిట ఉన్న ఆస్తుల విలువ చాలా ఎక్కువ రెట్లు ఉండటం. ఈ విషయాన్ని నేషనల్ మీడియా హైలెట్ చేస్తోంది. బాబు ఆస్తుల ప్రకటనను ఇలా కామెడీగా చూస్తోంది జాతీయ మీడియా. మొత్తానికి బాబు ఆస్తుల ప్రకటన అందరికీ కామెడీగానే మారింది!