Home రాజకీయాలు తెలంగాణలో రిచెస్ట్ పొలిటీషియన్ ఆయనే!

తెలంగాణలో రిచెస్ట్ పొలిటీషియన్ ఆయనే!

SHARE

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి ముఖ్య నేతలు అంతా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు తమ తమ ఆస్తుల విలువను అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రజలకు ఈ విధంగా క్లారిటీ వచ్చింది. అయితే ఈ ఆస్తుల విలువలు వాస్తవం కాకపోవచ్చు.

నేతలు అఫిడవిట్స్ లో పేర్కొన్న విలువకు మించి వారి ఆస్తుల మొత్తం ఉండవచ్చు. అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులకు మార్కెట్ విలువ అత్యంత భారీగా ఉండవచ్చు. అయినప్పటికీ ఏదో రకమైన విలువను నేతలు పేర్కొన్నట్టే. ఇలా ఆస్తులను డిక్లేర్డ్ చేసిన నేతల్లో అన్ని పార్టీల వారూ ఉన్నారు. మరి వారందరిలోనూ టాప్ పొజిషన్లో ఉన్నాడు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

నల్లగొండ జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన లక్ ను పరీక్షించుకుంటున్నాడు. మరి ముఖ్యనేతగా పేరు పొందిన ఈయన విజయం సాధిస్తాడనే చెప్పాలి.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ విషయానికి వస్తే.. అవి మూడు వందల కోట్ల రూపాయలకుపైనే ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన భార్య పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ ఇది. ఈ స్థాయిలో ఆస్తులను డిక్లేర్డ్ చేసిన మరొక నేత ఎవరూ ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోవబడం విశేషం. మొత్తానికి తెలంగాణలో ప్రస్తుతానికి రిచెస్ట్ పొలిటీషియన్ గా ఒక కాంగ్రెస్ నేత నిలుస్తుండటం ఆసక్తిదాయకం.