Home రాజకీయాలు నమ్మరని తెలిసినా.. నారా ఆరాటం!

నమ్మరని తెలిసినా.. నారా ఆరాటం!

SHARE

దేశంలో ఆస్తుల ప్రకటన చేసే రాజకీయ కుటుంబం తమది ఒకటే అని నారా లోకేష్ బాబు చెప్పుకున్నాడు. ఈ ప్రకటనే హాస్యాస్పదం. ఎందుకంటే.. దేశంలో ప్రతి ప్రజాప్రతినిధీ ఆస్తుల ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఎన్నికల కమిషన్ వద్ద దాఖలు చేసే అఫిడవిట్స్ లో వారు వారు తమ ఆస్తుల విలువను పేర్కొంటూ ఉంటారు. అయితే.. లోకేష్ మాత్రం దేశంలో ఆస్తులన ప్రకటన చేసే రాజకీయ కుటుంబం తమది ఒకటే అని చెబుతున్నాడు.

ఇలా మాట్లాడితే నవ్వుతారు తెలిసిన వాళ్లు సెటైర్లు వేస్తారనే విషయంల లోకేష్ కు తెలియనిది కాకపోవచ్చు. నవ్వుల పాలవుతామని తెలిసినా నారా కుటుంబం ఈ విధమైన ఆరాటాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకే ఆస్తుల ప్రకటన అనే రొటీన్ కామెడీని చేస్తూ ఉంటుంది.

ఇక తాజాగా లోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన యథావిధగా నమ్మలేని విధంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే నారా కుటుంబం ఆస్తులు తగ్గినట్టుగా ఉన్నాయి. ప్రపంచంలో ఎవరి ఆస్తిలో అయినా గ్రోత్ ఉంటుంది కానీ, నారా ఫ్యామిలీ ఆస్తి విలువలో మాత్రం గ్రోత్ కనపడదు. గ్రోత్ చూపిస్తే తాము సత్యమంతులం కాకుండాపోతామని చంద్రబాబు నాయుడు కుటుంబం ఇలా ఏవో కల్లబొల్లి మాటలు చెబుతూ ఉంటుంది.

వీళ్లు ఆస్తుల ప్రకటన చేసినప్పుడల్లా ప్రత్యర్థులు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. వీళ్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తుతూ ఉన్నారు. అయినా..నారా కుటుంబం ఆరాటం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు!