Home రాజకీయాలు బాబు ఆస్తులపై .. ఫిర్యాదు.. అక్రమాలను తేల్చండి!

బాబు ఆస్తులపై .. ఫిర్యాదు.. అక్రమాలను తేల్చండి!

SHARE

చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన ఆస్తుల ప్రకటన ప్రహసనం ఈ సారి కూడా కొనసాగింది. ఎవరూ నమ్మరు.. అని తెలిసినా చంద్రబాబు కుటుంబం ఈ నాటకాన్ని రక్తి కట్టించే యత్నం చేసింది. దేశంలో ఆస్తుల ప్రకటన చేస్తున్న ఏకైక రాజకీయ కుటుంబం తమదే అని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఇదంతా రొటీన్ గా చెప్పే మాటే.

ఇక ఆస్తుల ప్రకటన కూడా కామెడీ కామెడీగా సాగింది. ఆస్తుల ప్రకటనల విషయంలో అసంబద్ధమైన మాటలనే చెబుతూ ఉంది నారాకుటుంబం. తమ ఆస్తుల విలువకు సంబంధించి మార్కెట్ విలువను వెల్లడించకుండా ఏవేవో కబుర్లు చెప్పారు.

కట్ చేస్తే.. చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల ప్రకటనపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఫిర్యాదు దాఖలైంది. చంద్రబాబు నాయుడు ఆస్తులు అనూహ్యమైన స్థాయిలో పెరిగిపోయాయని ఈ విషయాన్ని తేల్చాలని, దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని ఈ ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఒక న్యాయవాది ఈ ఫిర్యాదును దాఖలు చేయడం విశేషం.

చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల విషయంలో ఇటీవలే సెంటర్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత ధనికుడు అయిన సీఎంగా చంద్రబాబు పేరును పేర్కొంది సదరు సంస్థ. అయితే బాబు కుటుంబం మాత్రం వేరే నంబర్లు చెబుతోంది.
ఇలాంటి నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపించాలని ఫిర్యాదుదారుడు కోరినట్టుగా సమాచారం. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్.. ఈ అంశంపై విచారణ జరపనుందని తెలుస్తోంది.