Home రాజకీయాలు రాహుల్ ముందు సాగిల పడిన ఏకైక నేత చంద్రబాబే!

రాహుల్ ముందు సాగిల పడిన ఏకైక నేత చంద్రబాబే!

SHARE

ఇంత వరకూ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి దండేసి దండం పెట్టి, ఆయనను ప్రశంసించి, సన్మానించి వచ్చిన ఏకైక పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే.. అని అంటోంది నేషనల్ మీడియా. రాహుల్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడే అయినా..ఆయనను సీరియస్ గా తీసుకుంటున్నది ఆయన పార్టీలోని భజన పరులే తప్ప బయటి వాళ్లు ఆయనను పట్టించుకోవడం లేదు. ఆఖరికి కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటున్న పార్టీల అధినేతలు కూడా రాహుల్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు,

ఇదెందుకో చెప్పనక్కర్లేదు, రాహుల్ నేషనల్ లెవల్లో పప్పుగా పేరు పొందాడు. ఇక రాహుల్ కు ఉన్న మాస్ ఇమేజ్, నాయకత్వ పటిమ అనేవి కూడా అంరదికీ తెలిసినవే. ఈ నేఫథ్యంలో దేశంలోని ఏ రాజకీయ పార్టీ అధినేత, కాస్త జనాల్లో పట్టున్న వాళ్లెవ్వరూ రాహుల్ ను పట్టించుకోవడం లేదు. కానీ సరాసరి రాహుల్ ఇంటికి వెళ్లి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు.

కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న నేతలు డైరెక్టుగా ఏదైనా మాట్లాడాలంటే సోనియాగాంధీతో మాట్లాడుతున్నారు. ఆమె పార్టీ అధ్యక్ష హోదాలో లేకపోయినా.. వారు మాట్లాడాలంటే సోనియాతో మాట్లాడటం లేకపోతే కామ్ ఉండటం చేస్తున్నారు. అంతే కానీ..రాహుల్ ను పట్టించుకోవడం లేదు.

ఇదీ కథ. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ ను వెళ్లి కలిశాడు చంద్రబాబు నాయుడు. ఈ తీరును ఇతర జాతీయ పార్టీల నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారట. రాహుల్ ముందే చంద్రబాబు నాయుడు సాగిలాపడుతున్న తీరును చూసి బాబును కూడా వారు లైట్ తీసుకున్నారని సమాచారం.