Home రాజకీయాలు బాబు విహారాలపై వైఎస్ జగన్ సెటైర్లు!

బాబు విహారాలపై వైఎస్ జగన్ సెటైర్లు!

SHARE

ఒకవైపు రాష్ట్రం వివిధ సమస్యలతో సతమతం అవుతూ ఉంటే.. వాటిని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విహారాలు చేస్తున్నాడని అంటూ ధ్వజమెత్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయాలను తప్పు పట్టాడు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య వివిధ రాష్ట్రాలకు వెళుతూ అక్కడ వివిధ పార్టీల నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే. అదేమంటే బీజేపీ వ్యతిరేక కూటమిని తయారు చేస్తున్నాడు చంద్రబాబు అని ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమి అనడమే పెద్ద కామెడీ.

ఆపై అలాంటి కూటమి ఒకటి ఉంది. యూపీఏ రూపంలో కొనసాగుతూ ఉంది. ఆ కూటమిలోని నేతలను చంద్రబాబు కలిసి .. వారందరినీ తనే కలుపుతున్నా అని ప్రకటించుకుంటున్నాడు. అంతా తనే చేస్తున్నాను అని బాబు ప్రకటించుకుంటున్నాడు. మరి చంద్రబాబు చేతిలోనే చక్రం ఉంటే.. వాళ్లంతా బాబు వద్దకు రావాలి.కానీ.. బాబే వాళ్ల వద్దకు వెళ్లి.. దండేసి దండాలు పెట్టి.. అంతా తనేచేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు.

అంశాలనే జగన్ ప్రస్తావించాడు. ఒకవైపు రాష్ట్రం కరువుతో ఎండిపోతుంటే..చంద్రబాబు మాత్రం దేవేగౌడ వద్దకు వెళ్తాడని. .నువ్వైనా ప్రధానివి కావొచ్చు, తనైనా ప్రధానిని కావొచ్చని అంటాడని, స్టాలిన్ వద్దకు వెళ్లి ఇడ్లీ సాంబార్ తినొస్తున్నాడని.. మమతా బెనర్జీ దగ్గరకు వెళ్లి దేశాన్ని ఏలేద్దాం అంటున్నాడని.. ముందు రాష్ట్రం గురించి పట్టించుకునే శక్తి యుక్తి లేని చంద్రబాబు దేశాన్ని ఉద్ధరిస్తానని బయల్దేరాడని జగన్ ఆసక్తిదాయకమైన సెటైర్లు వేశాడు.