Home రాజకీయాలు సుష్మా స్వరాజ్… తప్పుకుంటున్నారు..రీజన్ అదే!

సుష్మా స్వరాజ్… తప్పుకుంటున్నారు..రీజన్ అదే!

SHARE

తను ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. తను ఇకపై డైరెక్ట్ పాలిటిక్స్ లో పోటీ చేయనని ఆమె ప్రకటించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని విదిశా స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు ఈ కేంద్రమంత్రి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సుష్మ తన రిటైర్మెంట్ ప్రకటన చేయడం విశేషం.

భారతీయ జనతా పార్టీలో సుష్మా స్వరాజ్ సీనియారిటీ గురించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆమె అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. దీనికి కారణం ఏమిటి అంటే..అనారోగ్య సమస్యలు అని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఈ సీనియర్ బీజేపీ నేత మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఇబ్బందిపడుతూ ఉన్నారట. అందుకు సంబంధించి చికిత్స జరిగినా సుష్మ మాత్రం మునుపటిలా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల రంగం నుంచి తప్పుకోవాలని ఆమె భావిస్తున్నట్టుగా సమాచారం.

అందుకే లోక్ సభకు కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేశారు. అయితే సుష్మను బీజేపీ ఇంతటితో వదిలేస్తుందా లేక ఆమె అనుభవాన్ని, పార్టీకి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేస్తుందా అనే అంశాలపై ముందు ముందు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.