Home సినిమా షకీలా బయోపిక్ ఫస్ట్‌లుక్ కేక..

షకీలా బయోపిక్ ఫస్ట్‌లుక్ కేక..

SHARE

90వ దశకంలో మలయాళంలో షకీలా సినిమా రిలీజ్ అవుతున్నదంటే స్టార్ హీరోలు సినిమాలు వాయిదా వేసుకొన్న సంగతి తెలిసిందే. షకీలా జీవితం ఆధారంగా సినిమా వస్తున్నది. షకిలా పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేను శృంగార తారను కాదు అంటూ (నాట్ ఏ పోర్న్ స్టార్‌) పోస్టర్‌పై రిచా చద్దా లుక్ కేక పెట్టించింది. ఒంటిపై నూలు పోగు లేకుండా బంగారం పూత పూసినట్టు నగలతో ధగధగ మెరిసిపోయింది. షకీలా లుక్‌లో రిచా చద్దా ఇచ్చిన పోజ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టుగానే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కేక పెట్టించింది.

ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న షకీలా బయోపిక్‌కు ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2019 వేసవిలో విడుదల కానున్నది. ఈ చిత్రాన్ని కర్ణాటకలోని ఓ కుగ్రామంలో షూట్ చేశారు. ఈ చిత్రంలో స్వయంగా షకీలా అతిథి పాత్రలో కనిపించడం విశేషం.